బిగ్‌బాస్ 10లో ఆ కంటెంట్ చాలా స్పెషల్...!
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10కి ఏర్పాట్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా రెడీ అయిందని, ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు సంబంధించిన షూటింగ్ సైతం ప్రారంభం అయినట్లు సమాచారం అందుతోంది.
By: Ramesh Palla | 6 Aug 2026 12:19 PM ISTతెలుగు బిగ్‌బాస్ సీజన్ 10కి ఏర్పాట్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా రెడీ అయిందని, ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు సంబంధించిన షూటింగ్ సైతం ప్రారంభం అయినట్లు సమాచారం అందుతోంది. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 నుంచి ఎంత మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పటికే కొందరు సెలబ్రిటీలను బిగ్‌బాస్ టీం ఎంపిక చేయడంతో పాటు వారితో అగ్రిమెంట్స్ సైతం చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని సీజన్‌లుగా ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ టీం పక్కన పెడుతూ వచ్చింది. అలా హోల్డ్‌లో ఉంచిన వారిలో ఇద్దరిని ఈ సీజన్‌కి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. ఎప్పటిలాగే బిగ్‌బాస్ లో గ్లామర్ జోడించేందుకు గాను టీం మెంబర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10లో...
ఇక బిగ్‌బాస్ సీజన్ 10 లో చాలా స్పెషల్ కంటెస్టెంట్‌గా రైటర్ కడలి సత్యనారాయణ నిలువబోతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే కడలి ఎంపిక పూర్తి అయిందని, ఆమెతో అగ్రిమెంట్ సైతం సైన్ చేయించారని తెలుస్తోంది. సీజన్ 10 లో ఆమె ఎంట్రీ దాదాపు ఖరారు అయిందనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆమె వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోయినా స్టార్ మా వర్గాల ద్వారా ఆమె ఎంట్రీ గురించి లీక్‌లు అందుతున్నాయి. చాలా తక్కువ సమయంలోనే రచయిత్రిగా కడలి మంచి పేరును సొంతం చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీ అనడంలో సందేహం లేదు. ఆమె ఇంటర్వ్యూలు లక్షల కొద్ది వ్యూస్‌ను దక్కించుకున్నాయి. అందుకే బిగ్‌బాస్ టీం ఆమెను ఈ సీజన్ కోసం సంప్రదించారు. ఆమె చేరికతో బిగ్‌బాస్ సీజన్ 10 స్పెషల్‌గా మారడం ఖాయం అని నిర్వాహకులు అంటున్నారు.
రచయిత్రి కడలి సత్యనారాయణ గురించి...
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జన్మించిన కడలి ఎంఏ ఇంగ్లీష్ చేసింది. తనకు ఉన్న రైటింగ్ ఆసక్తితో చిన్న వయసు నుంచే రచనలు మొదలు పెట్టింది. తాత గారు అయిన సత్యనారాయణ పేరును తన పేరుతో జత చేయడం ద్వారా ఈమెకు అదనపు గుర్తింపు దక్కింది. చలం రచనల ప్రభావం తనపై ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన కడలి ఎక్కువగా మహిళల పట్ల సమాజ పోకడలు వివరిస్తూ రచనలు సాగుతున్నాయి. చలం యొక్క ప్రేమ లేఖల మాదిరిగానే కడలి సైతం ప్రేమ లేఖలు రాయడం మొదలు పెట్టింది. తన ముందు ఉన్న ప్రేమ కథలను తన రచనలుగా మార్చింది. దాంతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రముఖ రచయితల సహకారం, ప్రోత్సాహంతో కడలి లెటర్స్ టు లవ్ రాయడం జరిగింది. ప్రముఖ నటి రేణు దేశాయ్ ఆ పుస్తకం ను రిలీజ్ చేశారు.
నాగార్జున బిగ్‌బాస్‌లో కడలి...
బుక్స్ రైటింగ్ మాత్రమే కాకుండా సినిమాలకు సైతం రచయిత్రిగా కడలి వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. మెల్ల మెల్లగా రచయిత్రిగా మంచి పేరు సొంతం చేసుకుంటున్న కడలి ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా మరింత మందికి చేరువ కాబోతుంది. బిగ్‌బాస్‌లో ఈమె రచనలతో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈమె రచనలకు సైతం మంచి పబ్లిసిటీ దక్కి, ఈమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కడలి వంటి సెన్సిబుల్ రైటర్ కి బిగ్‌బాస్ వంటి స్క్రిప్ట్ షో లో నెట్టుకు రావడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 10 ను కచ్చితంగా కడలి కోసం చూడాలి అనుకునే వారు ఉంటారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ బిగ్‌బాస్ కి ప్లస్ కావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
