షాలిని ఇచ్చిన ముద్దు గురించి స్పందించిన రోహిత్
దీనికి రోహిత్ దీటుగా బదులిస్తూ, "నీ స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను. నాకు రెస్పెక్ట్ లేదని అంటున్నావు.. షాలిని వెళ్తున్నప్పుడు నేను వెళ్లి ముద్దు పెట్టుకున్నాను.
By: Priya Chowdhary Nuthalapti | 27 Oct 2026 9:21 AM ISTబిగ్‌బాస్ తెలుగు ఏడో వారంలో జరిగిన డబుల్ ఎలిమినేషన్ల తర్వాత, ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఎపిసోడ్లో ఊపందుకుంది. మునుపటి టాస్క్‌లలో విజయం సాధించి గ్రీన్ జోన్లోకి వెళ్లిన త్రిగుణ్, దెబ్జానీ, ముఖేష్, అమన్ మరియు నీతులకు మాత్రమే ఈ వారం నామినేట్ చేసే ప్రత్యేక అధికారాన్ని బిగ్‌బాస్ ఇచ్చారు.
గ్రీన్ జోన్లో ఉన్న ఈ ఐదుగురు సభ్యులు చర్చించుకుని, ఎవరెవరిని నామినేట్ చేయాలో నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అమన్, దెబ్జానీ, నీతు, ముఖేష్‌లు ఒక్కొక్కరిని నామినేట్ చేయగా.. త్రిగుణ్ మాత్రం ముగ్గురిని నామినేట్ చేసే అవకాశం తీసుకున్నాడు.
ఝాన్సీని నామినేట్ చేస్తూ.. "నువ్వు గేమ్‌లు బాగానే ఆడుతున్నావు, కానీ హౌస్‌లో నీకంటూ ఓన్ ఐడెంటిటీ కనిపించడం లేదు" అని నీతు పాయింట్ పెట్టింది. రామకృష్ణను నామినేట్ చేస్తూ ముఖేష్ తీవ్రంగా స్పందించాడు. "హౌస్‌లో రోబోలా తిరుగుతున్నావు.. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు 'ఏయ్' అని అరిచి సైలెంట్ అయిపోతున్నావు, నీలో క్లారిటీ లేదు" అంటూ విమర్శించాడు ముకేశ్.
ఈ నామినేషన్ల ప్రక్రియలో త్రిగుణ్, రోహిత్‌ను తన రెండో నామినేషన్‌గా ఎంచుకోవడంతో వాతావరణం వేడెక్కింది. "బిగ్‌బాస్‌ను గానీ, పక్కన ఉన్న కంటెస్టెంట్లను గానీ గౌరవించడం లేదు. అందరినీ ఏవగింపుగా మాట్లాడుతున్నావు, నీలో ఎందుకంత అహంభావం?" అంటూ త్రిగుణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
దీనికి రోహిత్ దీటుగా బదులిస్తూ, "నీ స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను. నాకు రెస్పెక్ట్ లేదని అంటున్నావు.. షాలిని వెళ్తున్నప్పుడు నేను వెళ్లి ముద్దు పెట్టుకున్నాను. మీ దృష్టిలో ముద్దు వేరు కావచ్చు. కానీ ఆ రోజు నేను ఒంటరినైపోతానని భయపడ్డాను. షాలినిని నేను ఎందుకు ఇష్టపడతానో తెలుసా? తనకు 3 చపాతీలు వస్తే, రెండు తిని ఒకటి నాకు ఇచ్చేది. నా ఆకలిని చూసింది. మా మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ అది. కానీ ఒక వ్యక్తి వచ్చి ఇంత చులకనగా మాట్లాడితే నేను ఎలా సహించగలను?" అంటూ మండిపడ్డాడు.
గ్రీన్ జోన్ సభ్యుల డామినేషన్ నడుస్తున్న ఈ నామినేషన్ల పర్వంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని వివాదాలు చెలరేగుతాయో వేచి చూడాలి!
