సినిమా కష్టాలు కేవలం వెండితెర వాళ్లకే కాదు
ఈ క్రమంలో లేటెస్ట్ గా సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ తెలుగు రన్నరప్ అమర్ దీప్ రీసెంట్ గా ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు.
By: Ramesh Boddu | 13 Aug 2025 2:00 AM ISTసినిమా కష్టాలు కేవలం వెండితెర వాళ్లకే కాదు బుల్లితెర వాళ్లకు ఉంటాయి. ఐతే వాళ్ల సమస్యలు బయటకు కనబడవు.. సినిమా సెలబ్రిటీస్ ని తీసుకున్నట్టుగా వీళ్ల ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకోరు. కానీ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ తో కూడా ముఖాముఖి జరుపుతూ వారి కెరీర్ స్ట్రగుల్స్ గురించి తెలుసుకునే కార్యక్రమాలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ తెలుగు రన్నరప్ అమర్ దీప్ రీసెంట్ గా ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు.
నిద్ర మాత్రలు తీసుకుంటా..
అందులో తను రోజు పడుకోవడం కోసం నిద్ర మాత్రలు తీసుకుంటా అని చెప్పి షాక్ ఇచ్చాడు అమర్ దీప్. ఒకప్పుడు నా మెంటల్ స్టేటస్ సరిగా ఉండేది కాదు.. ఎక్కువ ఆలోచించే వాడిని.. జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని మరీ బాధపడే వాడిని.. సరిగా నిద్రపోయి కూడా చాలా రోజులు అవుతుంది. మూడు రోజులు పడుకుంటే మరో 3 రోజులు సరిగా నిద్రపట్టదు. కెరీర్ లో ఇంకా సక్సెస్ అవ్వలేదు. నేను అనుకున్నది జరగట్లేదు ఎలా అనుకున్నా ఎలా ఉన్నా అంటూ ఆలోచిస్తా అంటున్నాడు అమర్ దీప్.
ఆ టైం లో స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వాడాను.. యాంగ్జైటీ టాబ్లెట్స్ కూడా వాడతానని అన్నాడు అమర్ దీప్. సినిమాల్లో కూడా తాను నటించా కానీ ఎడిటింగ్ టేబుల్ మీద అవి ట్రిం అవుతున్నాయని చెప్పాడు అమర్దీప్. నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడులో చేశా. ఆ సినిమాలో నా సీన్స్ ట్రిం చేశారు. భలే భలే మగాడివోయ్, ఉంగరాల రాంబాబు, జక్కన్న, కృష్ణార్జున యుద్ధం ఇలా సినిమాల్లో మంచి రోల్స్ చేశా కానీ అవన్నీ కూడా ఎడిటింగ్ లో పోయాయి.
350 రూపాయలు మొదటి పారితోషికం..
జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తను 350 రూపాయలు మొదటి పారితోషికం అందుకున్నానని అన్నాడు అమర్దీప్. ఐతే తాను తెలిసే కొంతమందిని బాధపెట్టాను. అది నాకు ఇప్పుడు రివర్స్ అవుతుంది. కర్మని నమ్ముతా అంటున్నాడు అమర్దీప్. ఇక ఒకదశలో సూసైడ్ కూడా చేసుకోవాలని ట్రై చేశానని షాక్ ఇచ్చాడు అమర్దీప్.
అమర్దీప్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా చాలా సరదాగా ఎవరేం అన్నా సరే పట్టించుకోకుండా చాలా జోవియల్ గా ఉంటాడు. అలాంటి అతను లోపల ఇంత బాధపడ్డాడా అన్న ఆలోచన వస్తుంది. ఐతే ప్రస్తుతం అతని కెరీర్ బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. అంతేకాదు అతని లైఫ్ లోకి తేజశ్వి గౌడ వచ్చింది. ఇద్దరి జంట చాలా బాగుంటుంది.
