బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కూడానా..?
బిగ్ బాస్ సీజన్ 9కి కంటెస్టెంట్స్ ఎంపికలో భాగంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
By: Ramesh Boddu | 17 Nov 2025 10:24 AM ISTబిగ్ బాస్ సీజన్ 9కి కంటెస్టెంట్స్ ఎంపికలో భాగంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు బిగ్ బాస్ చూసే ఆడియన్స్ లో నుంచి ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అప్లేషన్స్ ఆహ్వానించడం వారిలో నుంచి కొందరిని సెలెక్ట్ చేసి వారిలో నుంచి ఫైనల్ గా ఆరుగురిని హౌస్ లోకి పంపించడం జరిగింది. సీజన్ 9లో కామనర్స్ నుంచి అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ లో 10 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇద్దరు కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నారు.
అగ్నిపరీక్ష కాన్సెప్ట్ నెక్స్ట్ కూడా..
బిగ్ బాస్ సీజన్ 9 కోసం మొదలు పెట్టిన ఈ అగ్నిపరీక్ష కాన్సెప్ట్ నెక్స్ట్ కూడా ఉంటుందట. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా ఉంటుందని టాక్. ఐతే ఈసారి బిగ్ బాస్ షోకి ముందు అగ్నిపరీక్ష నడిపించారు కానీ ఈసారి అగ్నిపరీక్ష సీజన్ తో సంబంధం లేకుండా కామనర్స్ నుంచి కొందరిని ఎంపిక చేసి వారితో అగ్నిపరీక్ష సీజన్ 2 నడిపిస్తారట. అందులో మంచి పర్ఫార్మ్ చేసి సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ సీజన్ 10 టైం లో ఆడియన్స్ తో ఓటింగ్ ద్వారా కామనర్స్ ని సెలెక్ట్ చేస్తారట.
సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ బిగ్ బాస్ డ్రీం ని ఫుల్ ఫిల్ చేయనున్నారు. బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం వల్ల కామనర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పొచ్చు. అగ్నిపరీక్ష ద్వారా ఈ సీజన్ ఒకరిద్దరు తప్ప స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నే ఎంపిక చేశారు. ఐతే సీజన్ 9 లో కామనర్ టైటిల్ విన్నర్ ఐతే మాత్రం బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2కి మరింత క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
నవదీప్, బిందు మాధవి, అభిజిత్ తో..
బిగ్ బాస్ సీజన్ 9లో అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ మంచి స్టఫ్ ఇచ్చారు. తప్పకుండా అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ తో పాటు షోని శ్రీముఖి హోస్ట్ చేశారు. అగ్నిపరీక్ష సీజన్ 2లో వీళ్లే కొనసాగుతారా లేదా వేరే బిగ్ బాస్ సెలబ్రిటీస్ వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 9 విషయానికి వస్తే మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో టైటిల్ రేసులో ముగ్గురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఐతే రాబోయే వారాల్లో వాళ్ల గ్రాఫ్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఐతే టైటిల్ విన్నర్ కి రన్నర్ చాలా క్లోజ్ రేషియో ఉండేలా కనిపిస్తుంది.
