Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. వారం ముందే విన్నర్ ని డిసైడ్ చేశారా..?

బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం రోజుల్లో ముగుస్తుంది. ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా మొదలైంది.

By:  Ramesh Boddu   |   13 Dec 2025 10:15 AM IST
బిగ్ బాస్ 9.. వారం ముందే విన్నర్ ని డిసైడ్ చేశారా..?
X

బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం రోజుల్లో ముగుస్తుంది. ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా మొదలైంది. ఆ కామనర్స్ ని కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. అగ్నిపరీక్ష నుంచి ఆరుగురు హౌస్ మేట్స్ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్లారు. వారిలో చివరి వారం వరకు కూడా కళ్యాణ్, డీమాన్ పవన్ ఉన్నారు. ఐతే సీజన్ 9లో టాప్ 5 ఎవరెవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టాప్ 4 దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే కానీ చివరి టాప్ కంటెస్టెంట్ ఎవరన్నది కాస్త సస్పెన్స్ కొనసాగుతుంది.

బిగ్ బాస్ సీజన్ 9 కామనర్ కళ్యాణ్..

ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 3 మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్ ఈ ముగ్గురు టాప్ 3 గా కొనసాగుతున్నారు. ఐతే సీజన్ 9 టైటిల్ విజేత ఎవరన్నది ఇంకా వారం తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. అయినా కూడా సీజన్ 9 విన్నర్ అంటే కళ్యాణ్ పడాల అంటూ కొందరు ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఇంకా సీజన్ పూర్తి కాకముందే విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారు.

అంతేకాదు గూగుల్ లో కూడా సీజన్ 9 విన్నర్ ని సెర్చ్ చేస్తే గూగుల్ ఏఐ కూడా కళ్యాణ్ పడాల విన్నర్ తనూజ రన్నర్ అని చూపిస్తుంది. కళ్యాణ్ పడాలకు ఎందుకు అంత క్రేజ్ అంటే ముందు బిగ్ బాస్ సీజన్ 9కి అతనొక కామనర్ గా వచ్చాడు. ఐతే అతనొక ఆర్మీ మ్యాన్ అవ్వడంతో ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. ప్రతి టాస్క్ ని ఆడుతూ హౌస్ లో అందరిచేత మంచి వాడు అనిపించుకున్నాడు కళ్యణ్ పడాల.

కళ్యాణ్ కి నాగార్జున ఎలివేషన్స్ ..

తనూజతో అతని ఫ్రెండ్ షిప్ ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ తో క్లోజ్ నెస్ ఇలా కళ్యాణ్ ని చాలా స్ట్రాంగ్ చేశాయి. నాగార్జున కూడా కళ్యాణ్ కి ఇచ్చే ఎలివేషన్స్ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా ఇంటి చివరి కెప్టెన్ అయినందుకు నాగార్జున కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ సెల్యూట్ కొట్టడం సూపర్ హై ఇచ్చింది.

కళ్యాణ్ పడాల రేసులో టాప్ లో ఉన్నాడు ఐతే అతని తో తక్కువ గ్యాప్ లోనే ఇమ్మాన్యుయెల్, తనూజ కూడా ఓటింగ్ లో దూసుకెళ్తున్నారు. అలాంటిది అతన్ని ఇంకా షో అవ్వకముందే విన్నర్ గా డిసైడ్ చేయడం షాకింగ్ గా ఉంది. మరి నిజంగానే గూగుల్ ఏఐ ప్రిడిక్షన్ ప్రకారం కళ్యాణ్ పడాల టైటిల్ విన్ అవుతాడా లేదా అన్నది నెక్స్ట్ వీకెండ్ తెలుస్తుంది.

ఈ సీజన్ విన్నర్ గా ఎవరు వచ్చినా కూడా వాళ్లకి హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉందని ఆడియన్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే టాప్ 3లో ఉన్న ముగ్గురు వారి బెస్ట్ ఎఫర్ట్ తోనే ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐతే టైటిల్ విజేత ఎవరన్నది.. ఆడియన్స్ ఎవరిని విజేతగా చూడాలని అనుకుంటున్నారు అన్నది డిసెంబర్ 21న తెలుస్తుంది.