బిగ్ బాస్ 9.. వైల్డ్ కార్డ్ గా ఆ స్టార్..?
ఐతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పై ఇప్పటికే ఆ లిస్ట్ కూడా వైరల్ గా మారింది. ఆ లిస్ట్ లో సీరియల్ యాక్టర్ సుహాసిని ఉన్నట్టు తెలుస్తుంది.
By: Ramesh Boddu | 23 Sept 2025 10:58 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి టైం రాబోతుంది. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఐదు వారాల తర్వాత హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఐదు వారాలు హౌస్ లో కంటెస్టెంట్స్ ఆట చూసి వచ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత ఆట మారిపోతుంది. తప్పకుండా వైల్డ్ కార్డ్ గా బిగ్ బాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. ఐతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పై ఇప్పటికే ఆ లిస్ట్ కూడా వైరల్ గా మారింది. ఆ లిస్ట్ లో సీరియల్ యాక్టర్ సుహాసిని ఉన్నట్టు తెలుస్తుంది.
సుహాసిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
చంటిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సుహాసిని ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. బుల్లితెర మీద అమ్మడు మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తన న్యాచురల్ లుక్స్ తో సహజ నటనతో ఆకట్టుకుంటుంది అమ్మడు. బిగ్ బాస్ సీజన్ 9 లో సుహాసిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే. ఐతే ఆమెకు స్మాల్ స్క్రీన్ పై ఉన్న ఇమేజ్ చూస్తే తప్పకుండా వైల్డ్ కార్డ్ గా వచ్చినా ఆమె హౌస్ లో అదరగొట్టేస్తుందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా సీరియల్ యాక్టర్స్ కొందరిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఐతే అందరిలో సుహాసిని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమెతో పాటు దివ్వెల మాధురి కూడా ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫిక్స్ అని టాక్. ఇక అలేఖ్య పికిల్స్ రమ్య కూడా బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుందని తెలుస్తుంది. సీజన్ 9 లో జరిగిన 2 వారల్లో ఆట బాగానే ఉన్నా కామనర్స్ కొంతమంది చేసే అతి వల్ల హౌజ్ లో ప్రతిదీ ఇష్యూనే అవుతూ వచ్చింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీరియల్ యాక్టర్స్..
ఇక సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీరియల్ యాక్టర్స్ ఎంట్రీ తప్పకుండా షోకి మంచి మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. సుహాసినికి స్మాల్ స్క్రీన్ పై మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ 9 ఆమె వచ్చిన తర్వాత మరింత బజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం నడుస్తుంది. హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది తెలుస్తుంది. ఐతే కొంతమంది ఇంకా ఓపెన్ అవ్వకుండా సేఫ్ గేం ఆడుతున్నారు. సో వాళ్ల ముసుగు కూడా తొలగించే టాస్క్ లు వస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాలి.
