బిగ్ బాస్ 9.. డేంజర్ జోన్ లో ఆ కంటెస్టెంట్..?
ఐతే సింగిల్ ఎలిమినేషన్ అయినా డబల్ ఎలిమినేషన్ అయినా కూడా ఈసారి ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోవడం పక్కా అని అంటున్నారు.
By: Ramesh Boddu | 9 Oct 2025 4:33 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ లో రాము రాథోడ్ కెప్టెన్ అయిన కారణంగా అతను సేఫ్ అవ్వగా బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచినందుకు ఇమ్మాన్యుయెల్ కూడా సేఫ్ అయ్యాడు. సో అలా వీళ్లిద్దరు తప్ప హౌస్ లో ఉన్న వాళ్లంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో వారం డబల్ ఎలిమినేషన్స్ ఉంటాయన్న టాక్ నడుస్తుంది. ఐతే సింగిల్ ఎలిమినేషన్ అయినా డబల్ ఎలిమినేషన్ అయినా కూడా ఈసారి ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోవడం పక్కా అని అంటున్నారు.
సీజన్ 9లో మొదటి వారం నుంచి ఆమె నామినేషన్స్ లో..
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు ఫ్లోరా షైనీ అని తెలుస్తుంది. సీజన్ 9లో మొదటి వారం నుంచి ఆమె నామినేషన్స్ లో ఉంటూ వస్తుంది. ఫ్లోరా షైనీ ఈ వారం కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఓపెన్ అయినా మిగతా నాలుగు వారాల నుంచి ఆమె కంటిన్యూగా లీస్ట్ పొజిషన్ లో ఉంటూ వస్తుంది. లాస్ట్ వీకెండ్ జరిగిన బ్లాక్ స్టార్ ఓటింగ్ లో కూడా హౌస్ మెట్స్ అంతా కూడా మెజారిటీగా ఆమె పేరు ఎంపిక చేశారు.
సో ఆమె ఎలిమినేషన్ ఈ వారం ఉంటుందని ఆమె కూడా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. ఐతే ఫ్లోరాతో పాటుగా మరో ఇద్దరికి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అది ఎవరు అంటే ఒకరు శ్రీజా కాగా మరొకరు సుమన్ శెట్టి. ఆల్రెడీ జరుగుతున్న లీడర్ బోర్డ్ టాస్క్ లో వీళిద్దరే ఒక జోడెగా ఉన్నారు. టీంస్ అందరి కన్నా లీస్ట్ లో ఉన్నారు.
ఐదో వారం ఎలిమినేషన్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..
బిగ్ బాస్ సీజన్ 9 ఐదో వారం ఎలిమినేషన్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయన్న టాక్ ఉంది. సో ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియతో పాటు హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్స్ తో షో మరింత క్రేజీగా ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా వచ్చిన ఫ్లోరా షైనీ నాలుగు వారాలు కంటిన్యూస్ గా నామినేషన్స్ లో ఉంటూ వచ్చింది.
ఐతే ముందు నాలుగు వారాలు ఆమె నామినేషన్స్ చివరి దాకా ఉంటూ వచ్చింది. ఐతే నాలుగో వారం ఎవరైతే హరీష్ బయటకు వెళ్లాడో అప్పుడు ఆమెను ముందు సేఫ్ చేశారు. ఐతే ఈ వారం డబల్ ఉంటే ఫ్లోరాతో మరొకరు.. లేదా ఒకరే అయితే ఫ్లోరా షైనీ హౌస్ కి గుడ్ బై చెప్పే ఛాన్సెస్ హైగా ఉన్నాయి.
