Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. అతనితో అతుక్కుని నైట్ అంతా అలా.. రీతూ పై సంజన షాకింగ్ కామెంట్స్..!

అలా భరణి పేరుని సంజన, దివ్య రాశారు. తనూజ పేరు భరణి రాశాడు. తనూజ డీమాన్ పవన్ పేరు రాసింది. సంజన పేరుని సుమన్ శెట్టి రాశాడు.

By:  Ramesh Boddu   |   25 Nov 2025 9:26 AM IST
బిగ్ బాస్ 9.. అతనితో అతుక్కుని నైట్ అంతా అలా.. రీతూ పై సంజన షాకింగ్ కామెంట్స్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ ఫైర్ ఒక రేంజ్ లో జరిగింది. లాస్ట్ వీక్ ఫ్యామిలీస్ అంతా వచ్చి హౌస్ మేట్స్ కి కావాల్సినంత బూస్టింగ్ ఇచ్చారు. ఐతే నెక్స్ట్ వీకెండ్ లో కూడా మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సపోర్టర్స్ వచ్చి హౌస్ మేట్స్ ని ఖుషి చేశారు. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి నామినేషన్స్ రెండు దశల్లో జరుగుతుందని చెప్పాడు. అది ఫస్ట్ రౌండ్ లో బిగ్ బాస్ ఒక హౌస్ మేట్ ని పిలిస్తే అతను వెళ్లి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బాక్స్ లో సీక్రెట్ నామినేషన్ అంటే తను ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నాడో వారి పేరు రాసి బాక్స్ లో వేయాలి.

భరణి దివ్యని నామినేట్ చేస్తూ..

అలా భరణి పేరుని సంజన, దివ్య రాశారు. తనూజ పేరు భరణి రాశాడు. తనూజ డీమాన్ పవన్ పేరు రాసింది. సంజన పేరుని సుమన్ శెట్టి రాశాడు. సుమన్ శెట్టి పేరుని కళ్యాణ్ రాశాడు. డీమాన్ పవన్ తన ఫ్రెండ్ కళ్యాణ్ పేరు రాశాడు. అలా ఫస్ట్ రౌండ్ లో అందరు నామినేట్ అయ్యారు. ఇక రెండో రౌండ్ లో దివ్య తనూజని చేసింది. తనూజ కూడా దివ్యాని నామినేట్ చేసి పర్సనల్ గా ఇప్పటివరకు జరిగింది వదిలేసి మూవ్ ఆన్ అవుదామని అనుకున్నారు.

ఇక భరణి దివ్యని నామినేట్ చేస్తూ గట్టిగా మాట్లాడకు.. చెప్పింది వినిపించుకోవాలని అన్నాడు. మధ్యలో భరణి వైపు దివ్య వేలు చూపిస్తే అలా చూపించకు అంటూ వాదించాడు. భరణి నుంచి ఈ ఫైర్ అది కూడా దివ్య మీద చూపించడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇదే కదా భరణి నుంచి ఎన్నాళ్ల నుంచో కోరుకునేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఇమ్మాన్యుయెల్ మరోసారి తనూజని చేశాడు. కళ్యాణ్ ని డీమాన్ పవన్, రీతొ నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ ఇమ్మాన్యుయెల్ ని నామినేట్ చేశాడు. ఆ టైం లో ఇమ్మాన్యుయెల్ పవన్ డిస్కషన్ లో కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు. మధ్యలో రీతు కూడా వచ్చి గొడవ పెద్దదైంది. డీమాన్ పవన్ అతని గేం రీతు వల్ల పోతుందని కళ్యాణ్ అన్నాడు.

ఇదే ఆర్గ్యుమెంట్ లో సంజన నీలాగా నైట్ చేతులు పట్టుకుని..

ఇక సంజన తనూజని నానినేట్ చేసింది. కెప్టెన్ రీతు ఒకేసారి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండగా కళ్యాణ్ ని ఒక నామినేట్ చేసింది. నెక్స్ట్ సంజనాని నామినేట్ చేస్తూ ఇమ్మాన్యుయెల్ ని నామినేట్ చేయనందుకు రీజన్స్ అడిగింది. ఇక ఇదే ఆర్గ్యుమెంట్ లో ఫైర్ స్టోర్మ్ వచ్చినప్పటి నుంచి నేను మీ గేమ్ చూడలేదు అంటే నేను ఏమైనా నిద్ర పోతున్నానా అన్నది సంజన. అంతేకాదు ఇదే ఆర్గ్యుమెంట్ లో సంజన నీలాగా నైట్ చేతులు పట్టుకుని అతుక్కుని కూర్చోను అని అన్నది. ఆ విషయంపై సంజనాని తప్పని హౌస్ మేట్స్ అంతా అన్నారు. ఫ్రెండ్ పక్కన కూర్చుంటే ఏమైందంటూ రీతూ మాట్లాడింది. అలా సంజనా మరోసారి తన టంగ్ స్లిప్ అయ్యి నామినేషన్స్ లో ఫైర్ పెరిగేలా చేసింది.

సో ఫైనల్ గా 12వ వారం కెప్టెన్ రీతు తప్ప నామినేషన్స్ లో మిగతా అందరు సుమన్, భరణి, తనూజ, రీతు, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, దివ్య, కళ్యాణ్, సంజన ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది చూడాలి.