Begin typing your search above and press return to search.

ఆమెతో అతన్ని కూడా టాప్ 5కి తీసుకెళ్తుందా..?

అదేంటి అప్పుడే ఎలా అనుకోవచ్చు.. అఫ్కోర్స్ ఆట ఇంకా ఆరేడు వారాలు ఉన్నా కూడా ఇప్పటికే హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు.

By:  Ramesh Boddu   |   27 Oct 2025 9:28 AM IST
ఆమెతో అతన్ని కూడా టాప్ 5కి తీసుకెళ్తుందా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది. అదేంటి అప్పుడే ఎలా అనుకోవచ్చు.. అఫ్కోర్స్ ఆట ఇంకా ఆరేడు వారాలు ఉన్నా కూడా ఇప్పటికే హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎవరు ఆడియన్స్ మనసులు గెలుస్తున్నారు అన్నది తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి కంటెస్టెంట్స్ అంత గొప్ప పర్ఫార్మ్ చేయకపోయినా సరే ఉన్న వారిలో బయట ఉన్న ఫాలోయింగ్ కి తగినట్టుగా హౌస్ లో తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు కొందరు. ఐతే అందులో ఒక కంటెస్టెంట్ తనతో పాటు తనకు క్లోజ్ గా ఉన్న మరో కంటెస్టెంట్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5కి తను ఒక్కతే కాదు తనతో పాటు తన ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్లేలా ఉంది. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. తనూజ అని తెలుస్తుంది. తనూజ ఇప్పటికే హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. ఆమె టాప్ 5 పక్కా అనేస్తున్నారు. ఇప్పటికే మాక్సిమం ఆడియన్స్ ఆమె ఆట తీరుకి ఇంప్రెస్ అయ్యారు. ఐతే హౌస్ లో తనూజ అంటే ఇష్టం చూపిస్తూ ఆమెతోనే ఆటని కొనసాగించాలని చూస్తున్నాడు కళ్యాణ్ పడాల.

ఆర్మీ నుంచి వచ్చిన అతను బిగ్ బాస్ అగ్నిపరీక్ష దాటుకుని హౌస్ లోకి వచ్చాడు. తనూజ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ చిన్నగా ఆమెకు క్లోజ్ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ, కళ్యాణ్ మధ్య రిలేషన్ ఏంటన్నది ఆడియన్స్ కు ఒక క్లారిటీ ఉంది. తనూజ పక్కన ఉండటం వల్ల మాత్రమే కాదు కళ్యాణ్ కి కూడా బయట ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ కారణాలన్నీ చూస్తుంటే కళ్యాణ్ కూడా ఈ సీజన్ లో టాప్ 5 కి వచ్చేలా ఉన్నాడు.

కళ్యాణ్ కూడా ఫైనల్ వీక్ దాకా వెళ్లే ఛాన్స్..

ఐతే తనూజతో అతని పులిహోర కార్యక్రమాలు హౌస్ వరకు ఎలా ఉన్నా ఆడియన్స్ మాత్రం వాళ్ల ఫ్రెండ్ షిప్ ని అర్ధం చేసుకుంటున్నారు. ఇదే వర్క్ అవుట్ అయ్యింది అంటే మాత్రం తప్పకుండా కళ్యాణ్ కూడా ఫైనల్ వీక్ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ ఈ సీజన్ టాప్ 5కి వెళ్తే మాత్రం అది కచ్చితంగా తనూజ వల్లే ఆమెతో కలిసి ఇచ్చిన కంటెంట్ వల్లే అని చెప్పడంలో సందేహం లేదు.

మరోపక్క తనూజతో ఇమ్మాన్యుయెల్ కూడా ఈ సీజన్ టైటిల్ రేసులో దూసుకొస్తున్నాడు. ఐతే రాబోయే వారాల్లో ఎవరి ఆట ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి. టాప్ 5 లో వైల్డ్ కార్డ్స్ లో కూడా ఒకరిద్దరికి ప్లేస్ ఉండేలా ఉంది.