టాప్ 5 ఫ్యాన్స్ మీట్ లకు సూపర్ క్రేజ్..!
బిగ్ బాస్ సీజన్ 9 పూర్తైనా కూడా ఆడియన్స్ లో ఆ కంటెస్టెంట్స్ మీద ఇంకా అభిమానం తగ్గలేదు. ఈ సీజన్ టాప్ 5 కి వచ్చిన వాళ్లంతా పర్ఫెక్ట్ ఎలిజిబుల్ అనేలా ఉన్నారు.
By: Ramesh Boddu | 28 Dec 2025 2:46 PM ISTబిగ్ బాస్ సీజన్ 9 పూర్తైనా కూడా ఆడియన్స్ లో ఆ కంటెస్టెంట్స్ మీద ఇంకా అభిమానం తగ్గలేదు. ఈ సీజన్ టాప్ 5 కి వచ్చిన వాళ్లంతా పర్ఫెక్ట్ ఎలిజిబుల్ అనేలా ఉన్నారు. చివరి వరకు టాప్ 5 ఎవరు ఉంటారన్న సస్పెన్స్ ఉండగా ఫైనల్ గా ఆడియన్స్ ఓటింగ్ తో అర్హత ఉన్న వాళ్లే ఆ స్థానానికి చేరుకున్నారని భావించారు. ఐతే టాప్ 5 కి రావడం టైటిల్ విన్నర్, రన్నర్ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ సండే అంటే డిసెంబర్ 21న బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. ఐతే వారం అవుతున్నా బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ హడావిడి తగ్గట్లేదు.
టైటిల్ విన్నర్ కళ్యాణ్ కి విలేజ్ లో గ్రాండ్ వెల్కం..
ఓ పక్క టైటిల్ విన్నర్ కళ్యాణ్ కి తన సొంత జిల్లాలో తన విలేజ్ లో గ్రాండ్ వెల్కం దక్కింది. టైటిల్ గెలిచి వస్తాడని ఊహించని ఆ విలేజ్ పీపుల్ తమ ఊరు బిడ్డ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వడాన్ని ఒక పండగలా భావిస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి కాగా ఆదివారం తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి బుధవారం నుంచి వరుస ఫ్యాన్స్ మీట్ లు, ఇన్ స్టా లైవ్ లు పెట్టుకుంటున్నారు.
రీసెంట్ గా ఇమ్మాన్యుయెల్ తన ఫ్యాన్స్ మీట్ పెట్టుకున్నాడు. తనూజ ఆల్రెడీ తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రాం లైవ్ చిట్ చాట్ చేసింది. సంజనా కూడా రీసెంట్ గానే తన ఫ్యాన్స్ తో స్పెషల్ మీట్ ఏర్పాటు చేసుకుంది. డీమాన్ పవన్, భరణి కూడా ఫ్యాన్స్ మీట్ ప్లానింగ్ లో ఉన్నారు. బిగ్ బాస్ అయ్యింది వారమే కాబట్టి ఇప్పటికైతే వీరికి ఈ క్రేజ్ కొనసాగుతూనే ఉంది.
ఈ పాపులారిటీని గ్రాంటెడ్ గా తీసుకుంటే మాత్రం..
ఐతే ఈ టైంలోనే వాళ్లు కెరీర్ మీద మంచి స్టెప్ తీసుకుంటే ఈ క్రేజ్ అటు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాదని ఈ పాపులారిటీని గ్రాంటెడ్ గా తీసుకుంటే మాత్రం మళ్లీ మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ టాప్ 5 మాత్రమే కాదు టైటిల్ విన్నర్ కొట్టిన వాళ్లు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది. సో బిగ్ బాస్ సీజన్ 9 తో పాపులర్ అయిన వాళ్లు అలాంటి తప్పులు చేయకుండే ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.
సీజన్ 9 లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వాళ్లు ఇద్దరిలో ఒకరు టైటిల్ విన్నర్ మరొకరు టాప్ 3 దాకా వెళ్లడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అందుకే బిగ్ బాస్ టీం అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం రంగం సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే బిగ్ బాస్ 10 కి సంబంధించిన అగ్నిపరీక్ష ఆడిషన్స్ మొదలవుతాయని టాక్.
