Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఓనర్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం..?

కెప్టెన్సీ టాస్క్ తో పాటు ప్రతి వారం ఈ ఓనర్ గా ప్రమోట్ అయ్యే టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.

By:  Ramesh Boddu   |   20 Sept 2025 9:49 AM IST
బిగ్ బాస్ 9.. ఓనర్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం..?
X

బిగ్ బాస్ సీజన్ 9 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది కదా అనుకుంటే శుక్రవారం ఎపిసోడ్ లో టెనంట్స్ నుంచి ఓనర్ గా ప్రమోట్ అయ్యేందుకు టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో మిగిలిన టెనంట్స్ నుంచి ఒకరు ఓనర్ గా ప్రమోట్ అవుతారు. ఐతే టాస్క్ లో భాగంగా ఇచ్చిన బాస్కెట్ లో టెనంట్స్ వాళ్ల బొమ్మలను వేయాలి. ప్రతి రౌండ్ లో బజర్ మోగగానే టాస్క్ స్టార్ట్ అయ్యి.. బజర్ తో ఎండ్ అవుతుంది. ఈ సీజన్ ని టెనంట్స్ వర్సెస్ ఓనర్స్ అంటూ ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఐతే అందులో ఒక్కో వారం ఒకరు టెనంట్స్ నుంచి ఓనర్ గా మారతారు.

టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా..

కెప్టెన్సీ టాస్క్ తో పాటు ప్రతి వారం ఈ ఓనర్ గా ప్రమోట్ అయ్యే టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ వారం టెనంట్ నుంచి ఓనర్ గా రాము రాథోడ్ ప్రమోట్ అయ్యాడు. రీతూ చౌదరి వల్లే రాము రాథోడ్ ఓనర్ గా గెలిచాడు. ఐతే అంతకుముందు కెప్టెన్సీ టాస్క్ లో కూడా రీతూ ఇమ్మాన్యుయెల్ ని కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్ ఫైనల్ ప్లేస్ లో ఉండగా గ్రూప్ డెసిషన్ గా రాము రాథోడ్ ని ఎంపిక చేశారు.

ఐతే ఈ నిర్ణయం వెనక రీతు చౌదరి ప్రమేయం ఉందని తెలుస్తుంది. ఈ బొమ్మలను బుట్టలో వేసే టాస్క్ లో సంజన, ఫ్లోరా షైనీ, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి గట్టి ఫైట్ చేశారు. సంజన ఐతే రీతు చైదరిని ఎటాక్ చేసింది. ఇద్దరు కూడా కాసేపు పోటాపోటీగా ఆడారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ ఓనర్ గా నిలిచాడు. అతనికి బిగ్ బాస్ హౌస్ యాక్సెస్ తో పాటు ఓనర్ కి వచ్చే అన్ని ఫెసిలిటీస్ వస్తాయి.

ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్..

బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రతి టాస్క్ ని చాలా కాంప్లికేటెడ్ చేస్తున్నారు కంటెస్టెంట్స్. ప్రతి ఒక్క విషయాన్ని చాలా పెద్దది చేస్తున్నారు. సీజన్ 9 ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ గా డివైడ్ చేసిన ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు. మరి బిగ్ బాస్ టీం ఈ విషయాన్ని గుర్తించి టాస్కుల్లో కాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తేనే బాగుంటుంది లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం అన్నారు కానీ ఈ రణం అనవసరమైన విషయాలకు గోల చేయడం తప్ప అంత యూజ్ ఫుల్ డిస్కషన్స్ చాలా తక్కువ ఉన్నాయి.