బిగ్ బాస్ 9.. ఓనర్స్ మీద బిగ్ బాస్ ఫైర్..!
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన ఆరుగురు ఓనర్స్ వారు చేస్తున్న అశ్రద్ధ వల్ల షో మీద ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ పోయింది.
By: Ramesh Boddu | 20 Sept 2025 10:16 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో ఓనర్స్ చేస్తున్న అతికి బిగ్ బాస్ కి కూడా కోపం వచ్చింది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన ఆరుగురు ఓనర్స్ వారు చేస్తున్న అశ్రద్ధ వల్ల షో మీద ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ పోయింది. అదే కాదు బిగ్ బాస్ తెలుగు అయినా కూడా వాళ్లంతా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ హెచ్చరికలు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. బిగ్ బాస్ స్వయంగా ఓనర్స్ కి స్వేచ్చ ఎక్కువైంది అన్నట్టుగా చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 9 ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అంటూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు.
ఓనర్స్ కన్నా దారుణంగా..
కానీ ఓనర్స్ ఏమో నిజంగానే తాము ఇంటి ఓనర్స్ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. హౌస్ రూల్స్ పాటించకుండా ఉన్నందుకు కెప్టెన్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తానికి ఓనర్స్ మీద బిగ్ బాస్ ఫైర్ అవ్వడం వల్ల ఆడియన్స్ కూడా అలానే క్లాస్ పీకు బిగ్ బాస్ అనుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయండి అంటే ఓనర్స్ ప్రతి విషయాన్ని నానా రచ్చ చేస్తూ చిరాకు తెప్పిస్తున్నారు.
ముఖ్యంగా ఓనర్స్ లో ప్రియ, శ్రీజ వాళ్లు మాట్లాడితే గొడవకే అన్నట్టు ఉంది. సంజన కెప్టెన్ గా ఉన్నంత సేపు వాళ్లిద్దరు ఆమెను అసలు లెక్క చేయలేదు. ఆమెని కావాలని టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు.
లీస్ట్ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటకు..
ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ప్రియ కూడా ఉంది. ఉన్న వారిలో ఆమెనే లీస్ట్ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని భావిస్తున్నారు. హౌస్ లో ఆట కన్నా మాట ఇంపార్టెంట్ భావిస్తున్నారు కొందరు కంటెస్టెంట్స్ అయితే ఆ మాట కూడా ఏదో ఏది పడితే అది మాట్లాడాలి అన్నట్టు కాకుండా ఒక వాలిడ్ పాయింట్ తో మాట్లాడటమే ఆడియన్స్ కన్సిడర్ చేస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా షైనీ, ప్రియా శెట్టి, మనీష్, డీమాన్ పవన్, హరిష్ ఉన్నారు. వీరిలో ప్రియాకే తక్కువ ఓట్స్ ఉన్నాయి. ఐతే హరీష్ ఈ వారం 3 రోజులు ఏమి తినకుండా బిగ్ బాస్ లో ఉన్నాడు. అతని నిరాహార దీక్ష వల్ల హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ అతను బయటకు వెళ్తా వెళ్తా అంటున్నాడు కాబట్టి అతన్ని బయటకు పంపిస్తారేమో చూడాలి.
