Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరున్నారు..?

ఈసారి నామినేషన్స్ లో ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయడంతో పాటు మరొక కత్తి ఇచ్చి సరైన రీజన్స్ తో వాళ్లకు నచ్చిన వారికి నామినేట్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు

By:  Ramesh Boddu   |   29 Oct 2025 9:41 AM IST
బిగ్ బాస్ 9.. ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరున్నారు..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. ఈసారి నామినేషన్స్ లో ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయడంతో పాటు మరొక కత్తి ఇచ్చి సరైన రీజన్స్ తో వాళ్లకు నచ్చిన వారికి నామినేట్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ఈ నామినేషన్స్ లో వాదనలు బాగా జరిగాయి. శ్రీజ ఆల్రెడీ మాధురితో పోటీ పడగా తనూజ ఇమ్మాన్యుయెల్ ఫైట్ కూడా జరిగింది. సంజన మీద సుమన్ శెట్టి కూడా తన కెప్టెన్సీని తొక్కలో కెప్టెన్ అన్న విషయంపై ఫైర్ అయ్యాడు.

ఈ వారం హౌస్ నుంచి ఎనిమిది మంది నామినేట్..

ఆఫ్క్టర్ నామినేషన్స్ ఈ వాదన మాధురి, సంజనల మధ్య జరిగింది. ఇక నామినేషన్ టైం లో రీతు, మాధురిల మధ్య కూడా గట్టి వాదన జరిగింది. ఫైనల్ గా ఈ వారం హౌస్ నుంచి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో మాధురి, సంజన, కళ్యాణ్, రీతు, తనూజ, రాము, డీమాన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఐతే తనూజ, సంజన, గౌరవ్, పవన్, రీతు వీళ్లు సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. మాధురి, రాము డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి ప్రతి విషయంలో తన డామినేషన్ చూపించేలా ఆమె ఎటాకింగ్ ఉంది. ఆమె హౌస్ లో బిగ్ బాస్ రూల్ కాదు తన రూల్ అనేలా ప్రవర్తిస్తుంది. ప్రత్యేకంగా గేం ప్లాన్ అంటూ ఏమి లేదు కానీ మాధురి ఎటాకింగ్ ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది.

ప్రతి ఒక్కరు ఎత్తుకి పై ఎత్తులు..

ఈ వారం ఆమె నామినేషన్స్ లో ఉంది కాబట్టి బహుశా ఆమెను హౌస్ నుంచి ఆడియన్స్ బయటకు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె కాకుండా రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉంటాడు. రాము చాలా సైలెంట్ పర్సన్.. సరైన పాయింట్స్ కూడా చెప్పలేకపోతున్నాడు. హౌస్ లో ప్రతి ఒక్కరు ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంటే రాము రాథోడ్ మాత్రం ఎలాంటి ప్లానింగ్ లేకుండా వెళ్తున్నాడు. పోనీ టాస్క్ లల్లో ఏదైనా సత్తా చాటుతున్నాడా అంటే అది లేదు.

ఐతే బయట ఒక ప్రైవేట్ సింగర్ గా.. డాన్సర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న రాము ఇలా సైలెంట్ గా అందరికన్నా వెనక ఉండటం ఆడియన్స్ కి నచ్చట్లేదు. రాము ప్రతి విషయంలో కనీసం తను ఇన్వాల్వ్ అయిన విషయంలో అయినా స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. మాధురి, రాము కాకుండా సంజన, గౌరవ్, రీతు కూడా ఈ వారం డేంజర్ జోన్ కి దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి ఈ వీకెండ్ బయటకు వెళ్తారన్నది చూడాలి.