Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. హౌస్ లో ఎంటరైన కామనర్స్..!

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారంలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ లోకి 3వ వారంలోనే మరో నలుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు.

By:  Ramesh Boddu   |   25 Sept 2025 9:11 AM IST
బిగ్ బాస్ 9.. హౌస్ లో ఎంటరైన కామనర్స్..!
X

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారంలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ లోకి 3వ వారంలోనే మరో నలుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లంతా వచ్చి హౌస్ లో సందడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 మొదలవడానికి ముందు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా 13 మంది కామనర్స్ ఫైనల్ అయ్యారు. ఐతే వారిలో నుంచి ఆరుగురు ఆడియన్స్ ఓటింగ్ ఇంకా జడ్జెస్ సెలక్షన్ ద్వారా హౌస్ లోకి పంపించారు. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష టైం లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొందరు హౌస్ లోకి రాలేదన్న ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. ముఖ్యంగా ఒకరిద్దరి విషయంలో ఆ కామెంట్స్ బాగా వినిపించాయి.

హౌస్ లోకి షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య, అనూష..

అందుకే బిగ్ బాస్ సీజన్ 9 లో మరో కామనర్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. నేడు హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య, అనూష నలుగురు హౌస్ లోకి వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ హౌస్ లో ఉన్న వాళ్లతో మాట్లాడతారు. ఐతే వీరిలో నుంచి ఒకరు హౌస్ లోకి ఆహ్వానించాలని బిగ్ బాస్ హౌస్ మెట్స్ కి చెబుతాడు. ఐతే అందరు కూడా దివ్యాకి ఓటేస్తారు. అలా బిగ్ బాస్ సీజన్ 9 లో దివ్యా నిఖిత 3వ వారం హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 9 రెండో వెర్షన్ అంటే 2.ఓ కూడా ఉండబోతుంది. దసరా టైం లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో షో మరింత హైప్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది. సీజన్ 9లో ఈసారి 2.ఓ లో భాగంగా సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వనున్నారు. అంతేకాదు వారితో మరో ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 2.O..

అంటే ఈరోజు హౌస్ లోకి వెళ్లిన కామనర్స్ కూడా 2.Oలో మళ్లీ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో మంచి ప్లానింగ్ తో వెళ్తున్నారు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా ఫైనల్ కి చేరిన మరో నలుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం స్ర్ ప్రైజింగ్ గా ఉంటుంది. కచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 9 లో రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెలబ్రిటీస్ కూడా క్రేజీగా ఉన్నారు. అందులో సీరియల్ యాక్టర్ దివ్యతో పాటు దివ్వెల మాధురి, అలేఖ్య పికిల్స్ రమ్య ఇలా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారు.