Begin typing your search above and press return to search.

బీబీ హోస్ట్.. నాగార్జున బెస్ట్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరంభం కాబోతుంది. ఈ సీజన్ ని చాలా పెద్ద ప్లానింగ్ తో చేస్తున్నారట బిగ్ బాస్ టీం.

By:  Ramesh Boddu   |   1 Aug 2025 1:16 PM IST
బీబీ హోస్ట్.. నాగార్జున బెస్ట్..!
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరంభం కాబోతుంది. ఈ సీజన్ ని చాలా పెద్ద ప్లానింగ్ తో చేస్తున్నారట బిగ్ బాస్ టీం. ప్రతి సీజన్ ముందు కంటెస్టెంట్ లిస్ట్ గురించి ఎలా న్యూస్ వైరల్ అవుతాయో హోస్ట్ గా నాగార్జున కూడా హోస్ట్ గా చేస్తాడా లేడా అన్న డిస్కషన్ నడుస్తుంది. కానీ సీజన్ 3 నుంచి రాబోతున్న సీజన్ 9 వరకు మన కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రతి సీజన్ కి కంటెస్టెంట్స్ లానే హోస్ట్ విషయంలో ఈ కన్ ఫ్యూజన్ ఎందుకో అర్ధం కావట్లేదు.

సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్..

బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. బిగ్ బాస్ అంటే ఏంటో తెలియని ఆడియన్స్ కు అప్పుడు ఈ షో చాలా ఆసక్తికరంగా ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా తారక్ హోస్ట్ ఉంది. ఇక రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేశాడు. ఆ సీజన్ హోస్ట్ గా చేయడం వల్ల నానికి బయట నెగిటివిటీ వచ్చింది. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 3 నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన సీజన్ 8 వరకు నాగార్జుననే హోస్ట్ గా కొనసాగుతూ వచ్చారు.

బిగ్ బాస్ తెలుగు అంటే నాగార్జున.. నాగార్జున అంటే బిగ్ బాస్ తెలుగు అనేలా చేశారు. ఐతే బీబీ హోస్ట్ గా నాగార్జున బెస్ట్ అనిపించుకుంటున్నా కూడా ఇంకా ఆయన మీద కూడా నెగిటివిటీ వస్తుంది. నాగార్జున కేవలం షో టైం కి వచ్చి పీ.సీ.ఆర్ నుంచి వచ్చే ఇన్ పుట్స్ ని కంటెస్టెంట్స్ తో చెప్పడం తప్ప షో చూడట్లేదని కంప్లైంట్స్ చేస్తున్నారు. నాగార్జున బిజీ షెడ్యూల్ లో బిగ్ బాస్ హోస్ట్ చేయడమే చాలా పెద్ద పని అనుకుంటాడు. మళ్లీ రోజుకి 1 అవర్ షో చూడటం జరగని పని.

సీజన్ 9 మేజర్ ఇష్యూస్..

ఐతే ఈసారి సీజన్ 9 కి వారం మొత్తం జరిగిన మేజర్ ఇష్యూస్ గురించి.. ఆ తర్వాత ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్న దాని గురించి డిస్కస్ చేస్తారట. సీజన్ 9 హోస్టింగ్ కోసం నాగార్జున కాస్త హోం వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారట. సో హోస్ట్ గా మళ్లీ వేరే ఆప్షన్ అనే డౌట్ లేకుండా ఈసారి అదరగొట్టేయాలని చూస్తున్నారు. నాగార్జున ఓ పక్క సినిమాలు మరోపక్క బిగ్ బాస్ ని బ్యాలెన్స్ చేస్తుంటారు.

షో మొదలవ్వడమే ఆలస్యం ఈ 3 నెలలు ప్రతి వీకెండ్ నాగార్జున బుల్లితెర ఆడియన్స్ ని పలకరిస్తారు. సో తప్పకుండా ఈ షో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని మాత్రం చెప్పొచ్చు.