Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్..?

ఆల్రెడీ గత రెండు రోజులుగా డాక్టర్ రూమ్ కు తరచు వెళ్తూ ఆట కూడా సరిగా ఆడలేకపోయింది అయేషా. అందుకే ఆమెను బయటకు పంపించేలా ప్లాన్ చేస్తున్నారట.

By:  Ramesh Boddu   |   23 Oct 2025 3:33 PM IST
బిగ్ బాస్ 9.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే అవుననే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేంటి వీకెండ్ నాగార్జున సార్ వచ్చి సండే ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారు కదా అంటే.. ఈ సీజన్ లో ఆటని మరింత రక్తి కట్టించేలా చేసేందుకు ప్రతి వారం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకు పంపిస్తారని టాక్.

లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారే డేంజర్ జోన్ లో..

ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేందుకు బిగ్ బాస్ సీజన్ 7లో వచ్చిన అమర్ దీప్ ఇంకా అర్జున్ హౌస్ లోకి వెళ్తారని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలంటే అది ఆడియన్స్ ఓటింగ్ వల్లే.. లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారే డేంజర్ జోన్ లో ఉండి హౌస్ నుంచి బయటకు వస్తారు. ఐతే ఈ సీజన్ శ్రీజ ఎలిమినేషన్ అలా జరగలేదు. వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ తీసుకున్న డెసిషన్ మేరకు ఆమె ఎలిమినేట్ అయ్యింది.

అలానే హౌస్ లోకి సీజన్ 7 కంటెస్టెంట్స్ అర్జున్, అమర్ దీప్ వెళ్లి రాముని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకెళ్తారట. ఐతే మళ్లీ రాము తిరిగి హౌస్ లోకి వెళ్తాడన్న టాక్ వస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికే అలా చేస్తున్నాడని తెలుస్తుంది. మరోపక్క అయేషా హెల్త్ ఇష్యూ వల్ల హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9 లో ఏడవ వారం నామినేషన్స్..

ఆల్రెడీ గత రెండు రోజులుగా డాక్టర్ రూమ్ కు తరచు వెళ్తూ ఆట కూడా సరిగా ఆడలేకపోయింది అయేషా. అందుకే ఆమెను బయటకు పంపించేలా ప్లాన్ చేస్తున్నారట. ఓ పక్క మిడ్ వీక్ ఎలిమినేషన్ మళ్లీ హౌస్ నుంచి అయేషా ఎగ్జిట్ ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ కి దూరమవుతారు. ఐతే రాము మళ్లీ తిరిగి హౌస్ లోకి వెళ్తాడట.

అయేషా విషయంలో ఏం జరుగుతుంది అన్నది క్లారిటా లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో ఏడవ వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఈ వారం రమ్య, దివ్య, రాము లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు.. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.