Begin typing your search above and press return to search.

తెలుగు రియాలిటీ షోకి ఆ లేడీ కొరియోగ్రాఫర్.. ఎవరంటే?

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

By:  M Prashanth   |   28 Aug 2025 5:00 PM IST
తెలుగు రియాలిటీ షోకి ఆ లేడీ కొరియోగ్రాఫర్.. ఎవరంటే?
X

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్స్ కంప్లీట్ ఇవ్వగా.. ఇప్పుడు సరికొత్తగా.. కొంగొత్తగా తొమ్మిదో సీజన్ సందడి చేయనుంది. ఈసారి కూడా టాలీవుడ్ కింగ్, సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు, అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఈసారి.. సీజన్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా భాగం కానున్నారు. ఆ సామాన్యులను సెలెక్ట్ చేసే పద్ధతి అగ్నిపరీక్ష రూపంలో జరుగుతోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌ లో ఆ ఎపిసోడ్స్ వరుసగా ప్రసారం అవుతున్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీలు ఎవరనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు మరో పేరు వినిపించింది. ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో పాల్గొననున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ డ్యాన్స్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద కొంతకాలం వర్క్ చేశారు. కొన్ని సినిమాల్లోని పాటలను కొరియోగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన పలు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో ఆమె కూడా పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆమె వర్క్ ను కొనియాడిన విషయం తెలిసిందే.

అదే సమయంలో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగు పెట్టనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమెను నిర్వాహకులు సంప్రదించారని, ఆల్మోస్ట్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఆమెకు మరో సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో లేదో.. తన ఆటతో ఆమె ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాలి.