Begin typing your search above and press return to search.

మళ్ళీ బిగ్ బాస్ కి ఇమ్మాన్యుయేల్..?

బిగ్ బాస్ సీజన్ 9లో సీజన్ విన్నర్ రన్నర్ తెలిసిపోయింది. ఐతే అసలు ఈ సీజన్ కి ఒక క్రేజ్ తెచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్.

By:  Ramesh Boddu   |   23 Dec 2025 4:09 PM IST
మళ్ళీ బిగ్ బాస్ కి ఇమ్మాన్యుయేల్..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో సీజన్ విన్నర్ రన్నర్ తెలిసిపోయింది. ఐతే అసలు ఈ సీజన్ కి ఒక క్రేజ్ తెచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్. బిగ్ బాస్ కోసం జబర్దస్త్ ని సైతం వదిలేసి వచ్చి స్టార్ మా లో ప్రోగ్రామ్స్ చేస్తున్న ఇమ్మాన్యుయెల్ కి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఐతే సీజన్ 9లో అతను కేవలం కామెడీ మాత్రమే కాదు టాస్క్ లల్లో కూడా మంచి ఫైర్ చూపించాడు. ఇమ్మాన్యుయెల్ ని కేవలం కమెడియన్ గా కాకుండా ఒక ఆల్ రౌండర్ గా ప్రతిభ చూసేలా ప్రతిభ చూపాడు.

సీజన్ 9 రిజల్ట్ పై అసంతృప్తిగా ఇమ్మాన్యుయెల్ ఫ్యాన్స్..

ఒకదశలో సీజన్ 9 విన్నర్ గా ఇమ్మాన్యుయెల్ ఉంటాడని అనుకోగా అనూహ్యంగా అతను టాప్ 4 లో బయటకు వచ్చాడు. ఇమ్మాన్యుయెల్ కూడా ఈ రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 రిజల్ట్ పై ఇమ్మాన్యుయెల్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఐతే వారి అన్ శాటిస్ఫ్యాక్షన్ ని గుర్తించిన బిగ్ బాస్ టీం ఇమ్మాన్యుయెల్ కి మళ్లీ మరో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ ఛాన్స్ ఒకసారి రావడమే లక్ అనుకుంటే కొంతమందికి అది రెండు సార్లు పలకరించింది. ఆల్రెడీ సీజన్ 8లో ఓల్డ్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ గా పంపించారు. అలానే సీజన్ 9లో టాప్ 2లో ఉంటాడని అనుకున్న ఇమ్మాన్యుయెల్ ని కూడా బిగ్ బాస్ సీజన్ 10లో కుదిరితే మరోసారి కంటెస్టెంట్ గా లేదంటే వైల్డ్ కార్డ్ గా పంపించాలని చూస్తున్నారు. ఐతే సీజన్ 9లో తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన ఇమ్మాన్యుయెల్ మరోసారి బిగ్ బాస్ ఛాన్స్ ని ఓకే చేస్తాడా లేదా అన్నది చూడాలి.

చివరి ఐదు వారాల్లో మొత్తం సీన్ రివర్స్..

ఇమ్మాన్యుయెల్ ఒక కమెడియన్ అన్న కారణంగానే అతను ఎంత కష్టపడినా కూడా టైటిల్ కి చేరువ అవ్వనివ్వలేదు. మొదటి పది వారాలు దాదాపు అందరి కన్నా ఇమ్మాన్యుయెలే టాప్ లో ఉండగా చివరి ఐదు వారాల్లో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. అంతేకాదు కళ్యాణ్, డీమాన్ ఆటని ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉండి ఎంకరేజ్ చేసి వాళ్లను ముందుకు పంపించి తను మాత్రం వెనక పడుతున్నాడన్న ఆలోచన లేకుండా ఉన్నాడు ఇమ్మాన్యుయెల్.

మరి ఇమ్మాయుయెల్ సీజన్ 9 రిజల్ట్ పై ఎలా రియాక్ట్ అవుతాడు.. నెక్స్ట్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తాడా లేదా అన్నది చూడాలి. ఐతే మరోసారి ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి అతన్ని కేవలం కమెడియన్ గా కాకుండా మంచి ఆల్ రౌండర్ గా గుర్తించి ఆడియన్స్ తనకు సపోర్ట్ చేయాలని ఇమ్మాన్యుయెల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.