Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఇమ్మాన్యుయేల్ కి ఇది ప్లస్సా మైనస్సా..?

ఇక జరిగిన 12 వారాల్లో కేవలం ఇమ్మాన్యుయెల్ రెండు వారాలు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నాడు. టాప్ 3లో ఒకడిగా ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటేనే ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది.

By:  Ramesh Boddu   |   3 Dec 2025 12:25 PM IST
బిగ్ బాస్ 9.. ఇమ్మాన్యుయేల్ కి ఇది ప్లస్సా మైనస్సా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో టాస్క్ లకు టాస్క్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ టాప్ లో దూసుకెళ్తున్నాడు ఇమ్మాన్యుయెల్. జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ తెచ్చుకున్న ఇమ్మాన్యుయెల్ ఈమధ్య అక్కడ ఎగ్జిట్ అయ్యి స్టార్ మాలో ఎంటర్ అయ్యాడు. కూకు విత్ జాతిరత్నాలు షో చేస్తూ వచ్చిన ఇమ్మాన్యుయెల్ ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ నుంచి తన ఆట ఆడుతూ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ వస్తున్నాడు ఇమ్మాన్యుయెల్. ఐతే కొన్నిసార్లు పట్టు విడుపు మంచిదే అయినా కూడా ప్రతిసారి ఇమ్మాన్యుయెల్ తానే గెలవాలి అన్న ప్రవర్తన కాస్త ఆడియన్స్ ని స్లెఫిష్ అనేలా చేసింది.

తనూజ ప్రతి వారం నామినేషన్స్ లో..

ఇక జరిగిన 12 వారాల్లో కేవలం ఇమ్మాన్యుయెల్ రెండు వారాలు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నాడు. టాప్ 3లో ఒకడిగా ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటేనే ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది. తనూజ ప్రతి వారం నామినేషన్స్ లో ఉండటం వల్ల ఆమె టాప్ 3లో ఛాన్స్ దక్కించుకుంది. ఓ పక్క కళ్యాణ్ పడాల కూడా తన ఆట తీరుతో టాప్ 3లో ఉన్నాడు. దాదాపు సీజన్ 9లో ఈ ముగ్గురే టాప్ 3 కన్ ఫర్మ్ అని తెలుస్తుంది.

ఐతే టాప్ 3లో ఉన్న వారు ఎంత వీలైతే అంత నామినేషన్స్ లో ఉండాలి. కానీ ఈ వారం ఇమ్మాన్యుయెల్ నామినేషన్స్ లో లేడు. సో అతను నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఈ చివరి వారాల్లో కూడా అతని సపోర్టర్స్ వేరే వాళ్లకు ఓట్ వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నా ఆల్రెడీ తనూజ, కళ్యాణ్ ల ఓట్ బ్యాంక్ దాటి వెళ్తేనే ఈ సీజన్ విన్నర్ గా ఇమ్మాన్యుయెల్ అవగలుగుతాడు.

ఇమ్మాన్యుయెల్ సీజన్ 9 విన్నర్ అవ్వాలంటే..

ఇమ్మాన్యుయెల్ సీజన్ 9 విన్నర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎక్కువసార్లు నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల కూడా అతని ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇమ్మాన్యుయెల్ కాకుండా కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఈ సీజన్ విన్నర్ ఉంటారని ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు.

కామనర్ అయిన కళ్యాణ్ పడాల ఆర్మీ నుంచి బిగ్ బాస్ కి రావడం అతను ఇప్పటివరకు ఉండటంతో ఆడియన్స్ లో అతని మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. మరి కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్ అవుతాడా లేదా తనూజ, ఇమ్మాన్యుయెల్ ఇద్దరిలో ఒకరు ఫైనల్ విజేత అవుతారా అన్నది మరో 3 వారాల్లో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ విజేత ఎవరన్నది టఫ్ ఫైట్ నడుస్తుంది. రాబోయే రెండు వారాల్లో టాప్ కంటెస్టెంట్స్ ఆట తీరుని బట్టి కూడా ఎవరు విన్నర్ అవుతారన్నది క్లారిటీ వస్తుంది.