బిగ్ బాస్ 9.. షాకింగ్ సెకండ్ ఎలిమినేషన్..!
ఎపిసోడ్ మొదట్లోనే ఫ్లోరా షైనీని హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. ఇక చివర్లో శ్రీజ కూడా ఎలిమినేట్ అవుతుంది.
By: Ramesh Boddu | 12 Oct 2025 9:43 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అన్న టాక్ తెలిసిందే. ఆల్రెడీ నిన్న జరిగిన శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా అదే విషయాన్ని వెల్లడించారు. సీజన్ 9లో ఈ వారాంతరం డబల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరు ఈరోజు హౌస్ నుంచి బయటకు వెళ్తారు. ఐతే ఆల్రెడీ ఒకరు ఎవరన్నది తెలిసిపోయింది. ఫ్లోరా షైనీ ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మొదట బయటకు వచ్చేస్తారు. ఇక సెకండ్ ఎలిమినేషన్ ఎవరన్నది కాస్త హడావిడి నడిచింది.
వీళ్లిద్దరికి మాత్రమే ఎవిక్షన్ బోర్డ్స్..
శనివారం ఎపిసోడ్ లో ఎవిక్షన్ కి దగ్గరగా అంటూ ఫ్లోరా షైనీని, రీతుని చూపించారు. మిగతా వారంతా డేంజర్ జోన్ అని చూపించి వీళ్లిద్దరికి మాత్రమే ఎవిక్షన్ బోర్డ్స్ కనిపించాయి. ఐతే ఈ ఇద్దరే రేపు డబల్ ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ అనుకోవాలనే వాళ్లని మిస్ గైడ్ చేసేందుకే అలా చేశారు. కానీ ఫ్లోరా తర్వాత ఈరోజు ఎలిమినేట్ అయ్యే రెండో కంటెస్టెంట్ కామనర్స్ కేటగిరిలో అగ్నిపరీక్ష దాటుకుని మరీ వచ్చిన శ్రీజ అని తెలుస్తుంది.
శ్రీజ అగ్నిపరీక్ష టైం లోనే తన వాయిస్ డామినేషన్ తో కాస్త చిరాకు తెప్పించింది. ఐతే ఆమె మాట్లాడే పాయింట్స్ బాగుంటాయి. హౌస్ లో కూడా ఆమె తన వాయిస్ ని బాగా వాడుకుంది. కానీ ఒక విషయాన్ని ఎక్కడ ఆపాలి అన్నది ఆమెకు తెలియదు. అలా అవతల వారి మీద ఏదో ఒక విధంగా మాటలు అంటూనే ఉంటుంది. అదే ఆమె విషయంలో ఆడియన్స్ ని ఇరిటేట్ చేసింది. ఐతే శ్రీజ టాస్కుల్లో కానీ, అవతల వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ కానీ బాగా చేస్తుంది.
ప్రియా శెట్టితో చేసిన విషయాల వల్ల..
ఈ విషయంలో ఆమె స్ట్రాంగ్ అయినప్పటికీ ఎలిమినేషన్ తప్పలేదు. ఈరోజు ఒకే ఎపిసోడ్ లో డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎపిసోడ్ మొదట్లోనే ఫ్లోరా షైనీని హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. ఇక చివర్లో శ్రీజ కూడా ఎలిమినేట్ అవుతుంది. శ్రీజ కన్నా వీక్ గా ఉన్న వాళ్లు హౌస్ లో లేరా అంటే ఉన్నారు. కానీ శ్రీజ ఇంతకుముందు ఉన్న ప్రియా శెట్టితో చేసిన విషయాల వల్ల ఆమె రెండు మూడు వారాల్లోనే ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది. ఐతే నాగార్జున తన వాయిస్ తగ్గించుకోమని చెప్పిన దగ్గర నుంచి కేవలం ఏదైనా ఇష్యూ జరిగినప్పుడే శ్రీజ మాట్లాడింది. ఐతే అది ఆడియన్స్ కి నచ్చినా ఆమె ఎలిమినేషన్ తప్పలేదు.
సో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మరో కామనర్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆల్రెడీ ఆరుగురు కామనర్స్ లో మనీష్, హరీష్, ప్రియా బయటకు వచ్చేశారు. కళ్యాణ్, డీమాన్ పవన్, శ్రీజ మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇప్పుడు శ్రీజ కూడా బయటకు వచ్చేసింది కాబట్టి డీమాన్ పవన్, కళ్యాణ్ మాత్రమే కామనర్స్ గా హౌస్ లో ఉన్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారని తెలిసిందే.
