Begin typing your search above and press return to search.

బజ్‌ : బిగ్‌బాస్‌ 9 కంటెస్టెంట్స్ వీళ్లే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 9 ప్రారంభంకు అంతా సిద్దం అయింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.

By:  Ramesh Palla   |   8 Aug 2025 12:13 PM IST
బజ్‌ : బిగ్‌బాస్‌ 9 కంటెస్టెంట్స్ వీళ్లే
X

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 9 ప్రారంభంకు అంతా సిద్దం అయింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. గత సీజన్‌లో మాదిరిగా కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా గత సీజన్‌లలో పాల్గొన్న వారికి అవకాశం ఉండదు, కానీ ఈసారి పాత కంటెస్టెంట్స్‌కి, ముఖ్యంగా రన్నరప్‌గా నిలిచిన వారికి, టాప్ కంటెస్టెంట్స్‌గా నిలిచిన వారికి, ఇంతకు ముందు బాగా వివాదాస్పదం అయిన వారికి ఈ సీజన్‌లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పలువురు బుల్లి తెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ కు ఈ సారి ఛాన్స్ దక్కింది. వీరు మాత్రమే కాకుండా సామాన్యులకు సైతం ఈ సీజన్‌లో ఛాన్స్ దక్కింది. ఒక్కరు ఇద్దరు అని కాకుండా చాలా మంది సామాన్యులు ఈ సీజన్‌ లో కనిపించబోతున్నారు.

అమర్ దీప్‌ భార్య తేజస్విని గౌడకు ఛాన్స్‌

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అమర్‌ దీప్ యొక్క భార్య తేజస్విని గౌడకు సీజన్‌ 9 నుంచి ఆహ్వానం దక్కింది. ఇప్పటికే ఆమెతో ఒప్పందాలు జరిగాయని సమాచారం అందుతోంది. కన్నడ ఇండస్ట్రీకి, బుల్లి తెరకు చెందిన ఎంతో మంది ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ సందడి చేయబోతున్నారు. అందమైన ముద్దుగుమ్మలు, నవ్వించే కమెడియన్స్, డాన్సర్స్‌, గాయిని ఇలా ఎంతో మంది కలయికలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 యొక్క కంటెస్టెంట్స్ జాబితా ఉంది. నిన్న మొన్నటి వరకు చాలా మంది బుల్లితెర స్టార్స్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కన్నడ నటి దేబ్జాని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు దక్కింది.

బిగ్‌బాస్‌ 9 లో దేబ్జాని

దేజ్జాని అందంతో పాటు తన ప్రతిభతో ఖచ్చితంగా ఈ సీజన్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందిన ఆమెతో వర్క్‌ చేసిన వారు, ఆమెను బుల్లి తెరపై, సోషల్‌ మీడియా ద్వారా చూసిన వారు అంటున్నారు. చాలా మందికి ఈమె గురించి తెలుసు. వారు అంతా ఈమె ఉండాలని ఆశ పడుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా కూడా ఈమె సాధ్యం అయినంత వరకు ఎక్కువగా వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తన అందమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దాంతో నెట్టింట కూడా ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది. అందుకే ఈమె బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ఈమెకు బ్రహ్మరథం పట్టడంతో పాటు, ఓట్లను పెద్ద ఎత్తున వేసే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది అభిప్రాయం.

నాగార్జున హోస్ట్‌గా తెలుగు బిగ్‌బాస్‌

ఇంకా రాబోయే సీజన్‌లో ఇమాన్యూల్‌, నవ్య సామి, జ్యోతిరాయ్‌, ఆర్జే రాజ్‌, రీతూ చౌదరి, సీతాకాంత్‌, హారిక, ఏకనాథ్‌, సాయి కిరణ్‌, రమ్య మోక్ష, బబ్లూ ఇలా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 కి కొత్త హోస్ట్‌ వస్తాడనే వార్తలు వచ్చాయి. కొన్ని పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు నాగార్జున హోస్ట్‌ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా సీజన్‌ కి ఆయన మరింత స్పెషల్‌గా రెడీ అవుతున్నారని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటన్నింటికి చెక్ పెట్టాలన్నా, వాటన్నింటికి ఒక క్లారిటీ రావాలన్నా సీజన్ ప్రారంభం వరకు వెయిట్‌ చేయాల్సిందే.