బిగ్ బాస్ 9.. ఓనర్స్ VS టెనంట్స్..?
బిగ్ బాస్ సీజన్ 9 మరో 24 గంటల్లో మొదలవబోతుంది. ఈ సీజన్ మొదలవడానికి ముందే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.
By: Ramesh Boddu | 6 Sept 2025 10:15 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 మరో 24 గంటల్లో మొదలవబోతుంది. ఈ సీజన్ మొదలవడానికి ముందే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఈసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అంటూ కొత్త ప్లానింగ్ తో వస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ మధ్య ఫైట్ ఉండబోతుంది. ఐతే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతున్న ఈ టైం లో హౌస్ లో ఎలా ఉండబోతుంది అన్నది లీక్స్ వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈసారి రెండు హౌస్ లు ఉంటాయట. అందులో ఒకటి ఓనర్స్ మరొకరిది టెనంట్స్ అన్నమాట. ఓనర్స్ హౌస్ లో కామన్ మ్యాన్ ఉంటారట. టెనంట్స్ గా సెలబ్రిటీస్ ని ఉంచుతారట.
సీజన్ 9 మొదలు పెట్టడమే ఒక హై పిచ్..
అలా సెలబ్రిటీస్ నుంచి రెంట్ తీసుకుని ఓనర్స్ తమ పనులు చేసుకుంటారట. ఇందులోనే ఇంట్రెస్టింగ్ ఆట.. వాళ్ల మధ్య ఫైట్ ఇలా జరుగుతాయని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ లో ఈసారి ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది. సీజన్ 9 మొదలు పెట్టడమే ఒక హై పిచ్ ఫైర్ ఫుల్ ఎపిసోడ్ లా ఉండేలా ప్లాన్ చేశారట. అంతేకాదు ప్రతిసారి హౌస్ లో కొందరు ఆట కన్నా ఫ్రెండ్ షిప్, హ్యుమానిటీ అంటుంటారు కదా.. దానికి కూడా ఈ సీజన్ లో ఛాన్స్ ఉండదట.
ఫ్రెండ్స్ మధ్యలోనే టాస్క్ లు పెట్టి వాళ్ల మధ్య డిఫరెన్స్ వచ్చేలా చేస్తారట. సీజన్ 8 వరకు జరిగిన టాస్కులు ఒక ఎత్తైతే.. సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది.
సీజన్ 9 బిగ్ బాస్ టీం కొత్త ఉత్సాహంతో..
బిగ్ బాస్ తెలుగు గత రెండు మూడు సీజన్లుగా సరైన టి.ఆర్.పి తెచ్చుకోవడం లేదు. అందుకే సీజన్ 9 ప్రతి ఎపిసోడ్ దేనికదే హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దానికి కంటెస్టెంట్స్ ని సైత్మ సిద్ధం చేస్తున్నారట. ఓ విధంగా చెప్పాలంటే సీజన్ 9 బిగ్ బాస్ టీం కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి మొదలు పెట్టబోతున్న సీజన్ 9 వరౌ నాగార్జున తన హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టేస్తున్నారు. ఈ సీజన్ హోస్ట్ గా నాగార్జున కూడా ది బెస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ ని అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. వారిలో ఎవరు ఫైనల్ ఎపిసోడ్ లో ఉంటారా అన్న డిస్కషన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో జరుగుతున్నాయి.
