Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష లేటెస్ట్ ప్రోమో రిలీజ్.. హైలెట్స్ ఇవే!

అలా హిందీలో 19వ సీజన్ ప్రారంభం అవుతుండగా.. తెలుగులో 9వ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి 9వ సీజన్ ని ప్రారంభించబోతున్నారు.

By:  Madhu Reddy   |   17 Aug 2025 11:05 PM IST
బిగ్ బాస్ అగ్నిపరీక్ష లేటెస్ట్ ప్రోమో రిలీజ్.. హైలెట్స్ ఇవే!
X

పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ గా ప్రారంభమైన రియాలిటీ షో.. ఆ తర్వాత హిందీలో బిగ్ బాస్ పేరిట మొదలయింది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. దాంతో మిగతా భాషలలో కూడా ఈ షో నిర్వహించడం మొదలుపెట్టారు. అలా హిందీలో 19వ సీజన్ ప్రారంభం అవుతుండగా.. తెలుగులో 9వ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి 9వ సీజన్ ని ప్రారంభించబోతున్నారు. ఎప్పటిలాగే ఈ షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అలా తెలుగులో సెలబ్రిటీలతో మొదలైన ఈ షోలోకి నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, యూట్యూబర్లు కూడా వచ్చి చేరారు.

అయితే ఇప్పుడు మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగులో టీఆర్పీ రేటింగ్ పెంచడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు, మూడు సీజన్ ల నుంచీ ఈ హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఏకంగా 5 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ఇక హౌస్ లోకి వెళ్లడానికి సామాన్యుల నుంచి దాదాపు 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్లలో వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపి.. 40 మందిని ఎంపిక చేశారు. ఈ 40 మందికి అగ్ని పరీక్ష పేరుతో పోటీలు నిర్వహించి.. 15 మందిని ఎంపిక చేస్తారని సమాచారం. ఆ 15 మందికి అగ్నిపరీక్షలో వివిధ టాస్కులు నిర్వహించి.. గెలిచిన ఐదు మందిని మాత్రమే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి పంపించబోతున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ అగ్నిపరీక్ష కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 23 నుంచి బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు షోపై హైప్ పెంచడానికి నిర్వాహకులు రోజుకొక ప్రోమోని వదులుతూ షోపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ మేరకు ఇప్పుడు తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేసింది స్టార్ మా.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో 40 మంది సామాన్యులు పాల్గొనగా.. ఇందులో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం గమనార్హం. ఇకపోతే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో హౌస్ లోకి వెళ్లడానికి తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హైలెట్స్ విషయానికి వస్తే.. ఒక అమ్మాయి ఏకంగా పళ్ళు తోముకుంటూ నైటీ లోనే స్టేజ్ పైకి వచ్చింది. ఇంకొక పెద్దావిడ హౌస్ లో అన్నీ చేసి పెడతాను.. ఉపాసం కూడా ఉంటాను.. కానీ అవుట్ చేస్తే అంత చూస్తాను అంటూ ముందుగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక వ్యక్తి బ్లాక్ మాస్క్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తాడు.. నేను ఎలా ఉంటానంటే కూల్ డ్రింక్ లా ఉండను.. కషాయంలా ఉంటాను అని చెబుతాడు. దాంతో జడ్జ్ బిందు మాధవి మాట్లాడుతూ.. నువ్వు కషాయం కాదు విషం అంటూ కామెంట్ చేసింది. ఇంకొకరేమో హౌస్ లోకి వెళ్లడం తమ డ్రీమ్ అని చెబితే.. ఇంకొక వ్యక్తి ఏకంగా తన టాలెంట్స్ అన్నీ చెబుతూ చివర్లో హ్యాండీక్యాప్ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తనకు ఒక కాలు లేకపోవడాన్ని కూడా చూపించి జడ్జెస్ ను కూడా ఆశ్చర్యపరిచారు.. ఇలా 40 మంది ఎవరికి వారు తమ టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. ఇకపోతే ఇక్కడ అన్నిటికంటే అసలైన హైలెట్ ఏంటంటే ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ ఈ ప్రోమోలో కనిపించడం మరింత హైలెట్ గా అనిపిస్తుంది.. దీంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారుతోంది.