Begin typing your search above and press return to search.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా!

సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు కృష్ణుడు, చైత్ర రాయ్, సృష్టి ఎలిమినేషన్లు జరగగా, ఇప్పుడు హౌస్‌లోకి కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

By:  Priya Chowdhary Nuthalapti   |   9 Oct 2026 9:12 AM IST
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరమైన మలుపులతో సాగుతోంది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు కృష్ణుడు, చైత్ర రాయ్, సృష్టి ఎలిమినేషన్లు జరగగా, ఇప్పుడు హౌస్‌లోకి కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కొత్త వారికి చోటు కల్పించాలంటే ప్రస్తుత హౌస్‌మేట్స్‌లో ఎలిమినేషన్లు జరగాల్సి ఉండటంతో, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిజంగానే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే అపూర్వ మరియు ఝాన్సీ షో నుంచి బయటకు వెళ్లాల్సి రావొచ్చని సమాచారం. అలాగే వచ్చే వారంలో నటరాజ్ మాస్టర్ సతీమణి నీతూ, నటి ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్ శివ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వీరి రాకతో హౌస్ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. అగ్ని పరీక్ష షో నుంచి వచ్చిన అపూర్వ, ఝాన్సీ కనుక ఎలిమినేటి అయితే, రామకృష్ణ ఎంట్రీకి రంగం సిద్దమైనట్టే.

ఇక ఐదో వారంలో దేబ్జానీ, వర్షిణి, సుధీర్, వంశీ మినహా మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. డేంజర్ జోన్ నుంచి బయట పడేందుకు బిగ్‌బాస్ జంటలుగా విడిపోయి ఆడే టాస్క్‌లను ఇవ్వగా, ఈ క్రమంలో జరిగిన మొదటి టాస్క్‌లో అపూర్వ-చరణ్ జంట మొదటి స్థానంలో నిలవగా, రోహిత్-షాలిని జంట విఫలమైంది. అయితే రెండో టాస్క్‌లో భాగంగా బాల్‌ను హోల్ ద్వారా వెళ్లనివ్వాలనే రూల్ విషయంలో అపూర్వ మళ్లీ గొడవకు దిగింది. బాల్ బయటపడ్డా కూడా దాన్ని పరిగణించాలని ఆమె వాదించడంతో వంశీ, దేబ్జానీలతో ఆమెకు తీవ్ర వాగ్వాదం జరిగింది.

ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్, త్రిగుణ్, ముఖేష్‌లు టాప్ 3లో ఉన్నారు. మరోవైపు అపూర్వ, చరణ్ మరియు ఝాన్సీలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తుండటంతో, ఈ వారం ఈ ముగ్గురిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనితో అగ్ని పరీక్ష టీమ్ నుంచి మరో వికెట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇకపోతే షాలిని వల్ల రోహిత్ గేమ్ పూర్తిగా దెబ్బ తింటుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షాలిని ఎలిమినేటి అవ్వాలనే అభిప్రాయం కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుండటం విశేషం.