Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌజ్ కి అపూర్వ ఎంట్రీ ఇచ్చినట్టేనా?

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   25 Sept 2026 9:01 AM IST
బిగ్ బాస్ హౌజ్ కి అపూర్వ ఎంట్రీ ఇచ్చినట్టేనా?
X

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టాస్క్‌లు, నామినేషన్లు, గొడవలు, బాండింగ్స్‌తో హీటెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సారి ఏకంగా ముగ్గురు కొత్త కంటెస్టెంట్లను ఊహించని విధంగా హౌస్‌లోకి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఆల్రెడీ మిథిలేష్, అపూర్వ మరియు రామకృష్ణ మెరిసిన సంగతి మనకి తెల్సిందే. రేపటి ఎపిసోడ్ ప్రోమో లో అపూర్వ హౌజ్ లోకి ఎంటర్ అయినట్టు చూపించారు కానీ అందులో ఎంత వరకు నిజం ఉందన్న విషయం తెలియాల్సి ఉంది.

బిగ్‌బాస్ తెలుగు 10కు ముందు నిర్వహించిన 'అగ్నిపరీక్ష' కార్యక్రమంలో వీరు ముగ్గురూ పాల్గొన్నారు. వైల్డ్ కార్డ్ రేసులో దీపక్ పేరు కూడా వినిపించినప్పటికీ అతనికి మాత్రం చుక్కెదురైనట్టు తెలుస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ అంత ఈజీగా ఒక విషయం రివీల్ చేయరు. ఆ లెక్కన అపూర్వ వచ్చే విషయం నిజమే అయితే ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని మనం ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాలి.

అగ్నిపరీక్ష సమయంలో అపూర్వ, రోహిత్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందనే చర్చ అప్పట్లో జరిగింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్, షాలినిల మధ్య కూడా మంచి బాండింగ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, అపూర్వ ఎంట్రీ నిజంగా జరిగితే రోహిత్‌తో ఎలాంటి ఈక్వేషన్స్ క్రియేట్ అవుతాయి? ప్రస్తుత రోహిత్-షాలినిల బాండింగ్‌లో ఏమైనా మార్పు వస్తుందా? అనేది చూడటం ఆసక్తికరంగా మారొచ్చు. ఆల్రెడీ ఈ రోజు ఎపిసోడ్ లో రోహిత్ షాలిని లు అపూర్వ వస్తే ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నారు.

ఇప్పటికే కొన్ని వారాలుగా కలిసి ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడింది. కొత్తవాళ్లు హౌస్‌లోకి వస్తే పాతవాళ్లు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, కొత్తగా వచ్చే వారు బయట నుంచి షోను చూసి వస్తారు కాబట్టి, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరికి ఎవరితో గొడవలు ఉన్నాయి, ఎవరు ఏ గ్రూపులో ఉన్నారనే దానిపై వారికి ఒక అవగాహన ఉంటుంది.

ఇక ఏ కంటెస్టెంట్ పర్మనెంట్ గా హౌజ్ లో కి ఎంట్రీ ఇచ్చారన్న విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూడాల్సిందే.