మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ రగడ!
ఈ ఎనిమిదో వారం నామినేషన్లలో రోహిత్, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ (ఆర్కే), యాంకర్ వర్షిణి, సుధీర్ బరిలో నిలిచారు.
By: Priya Chowdhary Nuthalapti | 30 Oct 2026 9:05 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం ఆట మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత వారం దక్ష, షాలినిల డబుల్ ఎలిమినేషన్ తర్వాత, ఈ వారం కూడా అదే జోరు కొనసాగుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ కూడా ఈ విషయం స్పష్టం చేస్తూ ఈ సారి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందనే విషయం చెప్పారు.
ఈ ఎనిమిదో వారం నామినేషన్లలో రోహిత్, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ (ఆర్కే), యాంకర్ వర్షిణి, సుధీర్ బరిలో నిలిచారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే, రోహిత్ మరియు టెంపర్ వంశీ భారీ ఓట్లతో ముందంజలో ఉండగా, రామ్ ప్రసాద్, రామకృష్ణ, సుధీర్ వంటి వారు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే ఈ రోజు టాస్క్‌లో రామ్ ప్రసాద్ బాగా పెర్ఫార్మ్ చేయడంతో ఆయన్ని సేఫ్ జోన్ లోకి పంపించి ఎలిమినేషన్ స్కిప్ అయ్యేలా చేసారు బిగ్ బాస్.
అయితే, యాంకర్ వర్షిణి ఓటింగ్‌లో అత్యంత వెనుకబడి డేంజర్ జోన్లో నిలిచింది. ముకేష్ ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోవడం, టాస్కుల్లో సరైన ఇంపాక్ట్ చూపలేకపోవడం వంటి కారణాల వల్ల ఆమె లీస్ట్ పొజిషన్లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. కాకపోతే ఈ రోజు టాస్క్ పాజిటివ్‌గా మారడమే కాకుండా ఆమె కూడా రామ్ ప్రసాద్ తో పాటు వర్షిణి కూడా ఎలిమినేషన్ ఎస్కేప్ అయ్యి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.
ఒకవేళ గత వారం లాగే ఈసారి కూడా మేకర్స్ డబుల్ ఎలిమినేషన్‌కు మొగ్గు చూపితే, డేంజర్ జోన్లో ఉన్నవారితో పాటు మరొకరిపై ఎలిమినేషన్ వేటు పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. రామకృష్ణ, ఝాన్సీ, శ్వేతాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక ఎనిమిది వారాలు ముగిసిన తరుణంలో హౌస్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించేందుకు మేకర్స్ ఏలాంటి ట్విస్టులు ఇస్తారనేది వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున తేల్చనున్నారు.
