Bigg Boss Telugu 10: ఇక పై టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్
ఇప్పటికే పవర్ ఆఫ్ పీపుల్ ని చూసిన మనం, ఇక మూడో వారం గేమ్‌ను మరింత రసవత్తరం చేయడానికి "టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్" అనే సరికొత్త థీమ్‌ను చూడబోతున్నాం.
By: Priya Chowdhary Nuthalapti | 21 Sept 2026 9:41 AM ISTబిగ్బాస్ షో లో ఇప్పటికీ ఇద్దరు హౌజ్ మేట్స్ ఎలిమినేటి అయ్యారు. ఒకరు చైత్ర రాయ్ కాగా, ఇంకొకళ్ళు కృష్ణుడు. ఈ రోజు ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాక, వచ్చే వారం జరిగే టాస్క్స్ థీమ్ గురించి చెప్పారు హోస్ట్ నాగార్జున.
ఇప్పటికే పవర్ ఆఫ్ పీపుల్ ని చూసిన మనం, ఇక మూడో వారం గేమ్‌ను మరింత రసవత్తరం చేయడానికి "టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్" అనే సరికొత్త థీమ్‌ను చూడబోతున్నాం. ఈ వారం సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో చూసే ముందు, బిగ్‌బాస్ టీమ్ ఇప్పటికే ఇండైరెక్ట్గా హౌస్‌ను స్పష్టమైన గ్రూపులుగా విడదీసి సరికొత్త యుద్ధానికి రంగం సిద్ధం చేసింది.
వర్షిణి, ముఖేష్, సుధీర్ & ఝాన్సీ - వీరి నలుగురినీ త్రిగుణ్-వంశీ టీమ్ ఒక ప్రత్యేక గ్రూప్‌గా ముద్ర వేసింది. రాబోయే రోజుల్లో ఈ నలుగురికి, ఆ ఇద్దరికీ మధ్య అనేక అంశాల్లో తీవ్రస్థాయి వాగ్వాదాలు, ఘర్షణలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది.
అగ్నిపరీక్ష గ్రూప్ ఒక జట్టుగా కనిపిస్తున్నప్పటికీ, కామనర్లలోనూ చీలికలు ఉన్నాయి కానీ అవి బయట పడట్లేదు. కారణం ఏంటో తెలియడం లేదు కానీ అమన్ నెమ్మదిగా రోహిత్‌కు దూరమవుతున్నాడు. మరోవైపు రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ కూడా రోహిత్ నీడ నుంచి బయటకు వచ్చి తన సొంత గేమ్ ఆడేందుకు తాపత్రయపడుతున్నాడు.
రాంప్రసాద్, నరేష్ తమదైన శైలిలో కలిసే ఆడుతున్నా ఏ ఒక్క గ్రూప్‌లోనూ ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఏ గ్రూపుతోనూ సంబంధం లేకుండా, ఎవరి పక్షమూ వహించకుండా పూర్తిగా న్యూట్రల్ ప్లేయర్‌గా నిలిచింది కేవలం దేవయాని ఒక్కరే.
మొత్తానికి "టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్" థీమ్‌తో సాగే ఈ మూడో వారంలో ఈ గ్రూపుల మధ్య హై-వోల్టేజ్ పోరు నడవడం ఖాయం. అందుకు అనుగుణంగా, నాగార్జున హౌజ్ లో ఉన్న అందరినీ, బెస్ట్ ప్లేయర్ ఎవరు అని అడుగగా మెజారిటీ ముకేశ్ పేరు చెప్పడం తో ఆయన స్టార్ ఆఫ్ ది వీక్ అయ్యారు. అయితే ఇది అతనికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని మనం వేచి చూడాలి.
