బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పుడు మూడు గ్రూప్స్..!
బిగ్ బాస్ షో లో మొదటి వీకెండ్ లో త్రిగుణ్ కి నాగార్జున ఇచ్చిన డోసు సరిపోలేదు అని చాలా మంది ఫీల్ అయ్యిన సంగతి మనకి తెల్సిందే
By: Priya Chowdhary Nuthalapti | 15 Sept 2026 9:43 AM ISTబిగ్ బాస్ షో లో మొదటి వీకెండ్ లో త్రిగుణ్ కి నాగార్జున ఇచ్చిన డోసు సరిపోలేదు అని చాలా మంది ఫీల్ అయ్యిన సంగతి మనకి తెల్సిందే. అయితే ఆ బాధ్యతని మరో కంటెస్టెంట్ సుధీర్ తీసుకొని ఈ రోజు నామినేషన్స్ లో త్రిగుణ్ కి అదిరిపోయే రేంజ్ లో షాక్ ఇచ్చాడు. నిజానికి హౌజ్ లో రోహిత్ ఎటువంటి గ్రూప్ ని ఫార్మ్ చేయలేదు కానీ త్రిగుణ్ దృష్టి లో మాత్రం రోహిత్ క్లియర్ గా ముందు ఉంటూ, మిగిలిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని సుధీర్ స్పష్టం చేసేసాడు.
నామినేషన్స్ లో సుధీర్ పెట్టిన పాయింట్స్ కి త్రిగుణ్ డిఫెండ్ చేసుకోవడానికి తడబడ్డాడు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ దెబ్బతో హౌజ్ లో మొత్తం మూడు గ్రూప్స్ ఉన్నట్టు అర్థమైపోతుంది.
మొదటి గ్రూప్ అందరూ అనుకుంటున్నట్టుగా రోహిత్ గ్రూప్. దీన్ని అగ్నిపరీక్ష గ్రూప్ అని కూడా అంటారు. ఝాన్సీ తప్ప అగ్నిపరీక్ష లో పాల్గొన్న అందరూ ఈ గ్రూప్ లో ఉన్నారు. అయితే వీళ్లంతట వేళ్ళు ఎవరి జోలికి వెళ్లట్లేదు. వీళ్ళ జోలికి వస్తే మాత్రం ఐకమత్యంగా ఉంటున్నారు.
ఇక రెండో గ్రూప్ లో ఉండేది దేబ్జానీ, రాంప్రసాద్, నరేష్, అండ్ ముకేశ్. ఈ నలుగురు అవసరాన్ని బట్టి ఇండివిడ్యువల్ గా ఆడుతున్నారు. సపోర్ట్ కావలసినప్పుడు ఒకళ్ళనొకళ్ళు తోడుగా ఉంటున్నారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించినా పెద్దగా లొంగట్లేదు.
ఇక త్రిగుణ్ గ్రూప్ లో వర్షిణి, ఝాన్సీ, కృష్ణుడు పూర్తిగా అతనేం చెప్తే అది వింటారు. వాళ్ళకి రోహిత్ అన్నా, షాలిని అన్నా పడట్లేదు. ఇక అమన్, స్రిష్టి మీద కూడా వాళ్ళకి కోపం ఉంది. వంశీ కృష్ణ అయితే న్యూట్రల్ గా ఉంటున్నాడు. ఈ క్రమం లోనే ఇవాళ్టి ఎపిసోడ్‌తో, రోహిత్‌ను డామినేట్ చేయడానికి త్రిగుణ్ దేనికైనా తెగిస్తున్నాడని ప్రేక్షకులకు అర్థమైంది. హౌస్‌మేట్స్ కూడా అతని ఉద్దేశాన్ని పసిగట్టారు కాబట్టి, రాబోయే రోజుల్లో వారు దీన్ని ఏమాత్రం ప్రోత్సహించక పోవచ్చు.
ప్రసూతానికైతే త్రిగుణ్ కాస్త తగ్గినా, ఈ వారం గేమ్స్ తో మళ్ళీ పుంజుకుని రోహిత్ మీద విజృంభించే అవకాశం ఉంది.
