Begin typing your search above and press return to search.

బాబోయ్ త్రిగుణ్.. ఇంత వరస్ట్ ప్లేయర్ ని ఎప్పుడూ చూడలేదు

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు చేస్తున్న గొడవలు రోజు రోజుకూ డ్రామాను తారా స్థాయికి చేర్చుతున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   30 Sept 2026 9:21 AM IST
బాబోయ్ త్రిగుణ్.. ఇంత వరస్ట్ ప్లేయర్ ని ఎప్పుడూ చూడలేదు
X

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు చేస్తున్న గొడవలు రోజు రోజుకూ డ్రామాను తారా స్థాయికి చేర్చుతున్నాయి. ఇప్పటికే రోహిత్ మరియు త్రిగుణ్‌లు ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ స్టార్ ప్లేయర్‌లుగా ఎదుగుతున్నారు. అయితే త్రిగుణ్ మాత్రం సీజన్‌లోనే చెత్త ఆటగాడిగా మారుతున్నాడు. అయితే ఈ విషయాన్ని నామినేషన్స్ లో భాగంగా ఖరాఖండిగా చెప్పేసింది అపూర్వ. అసలు త్రిగుణ్ ఎలా ఆడతాడు అని చాలా కరెక్ట్ పాయింట్స్ తో చెప్పి త్రిగుణ్ కూడా సైలెంట్ అయ్యేలా చేసింది. త్రిగుణ్ కనుక తన ఆట తీరు మార్చుకోకపోతే, కచ్చితంగా అతనికి పెద్ద డ్యామేజ్ జరగబోతుంది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నిజానికి త్రిగుణ్ రోహిత్ ల విషయాల్లో రోహిత్ ని మెచ్చుకోవాల్సిందే. రోహిత్‌ను పరోక్షంగా అవమానించేలా త్రిగుణ్ ఎంత ట్రై చేస్తున్నప్పటికీ రోహిత్ సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా ఆడుతున్నాడు. రోహిత్‌ను ఎలాగైనా రెచ్చగొట్టి, అతను కోపం లేదా తప్పుడు మాటలు అనేలా చేసి, ఆ తర్వాత వీకెండ్‌లో తాను కావాలనే ఇదంతా చేశానని గర్వంగా చెప్పుకోవడమే త్రిగుణ్ నైజంగా మారిపోయింది.

మరో వైపు, స్టార్ మా మరియు నాగార్జున బృందం వీకెండ్ ఎపిసోడ్లలో రోహిత్ తప్పులను హైలైట్ చేస్తూ అతని పాపులారిటీని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయి. రోహిత్ చేసే చిన్న చిన్న తప్పుల వీడియోలను ప్లే చేసి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారు. ఈ వారం మొదటి రెండు రోజుల్లో కూడా రోహిత్ కొన్ని అనవసరమైన మాటలు అన్నాడు. నాగార్జున వాటిని ఎత్తిచూపుతూ అతన్ని డీమోరలైజ్ చేస్తూ, త్రిగుణ్‌ను మాత్రం ప్రశంసించే అవకాశం లేకపోలేదు.

సమయానికి త్రిగుణ్‌ను నియంత్రించకపోతే, అది అతనికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది మరియు అంతిమంగా రోహిత్‌కే మరింత మైలేజ్ ఇస్తుంది. ఇక పోతే రేపటి ప్రోమో లో కూడా అమన్ కి త్రిగుణ్ కి మధ్య గొడవలు గట్టిగానే జరగనున్నాయి.