షాలిని కాళ్ళ మీద పడబోయిన రామకృష్ణ
హౌస్‌లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఒక ఆసక్తికరమైన పరీక్ష పెట్టి, ఓజీ కంటెస్టెంట్ల స్వభావం మరియు ఆట తీరును బట్టి వారికి ట్యాగ్లు ఇవ్వాలని సూచించారు.
By: Priya Chowdhary Nuthalapti | 15 Oct 2026 9:14 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు పాత ఓజీ కంటెస్టెంట్లకు ఇచ్చిన ట్యాగ్స్, ఆపై చెలరేగిన గొడవలు షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
హౌస్‌లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఒక ఆసక్తికరమైన పరీక్ష పెట్టి, ఓజీ కంటెస్టెంట్ల స్వభావం మరియు ఆట తీరును బట్టి వారికి ట్యాగ్లు ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ సభ్యులు అందరూ చర్చించుకుని రోహిత్‌ను 'డ్రామా కింగ్' గా నిర్ణయించగా, ఏ విషయంలోనైనా రోహిత్ అనవసరంగా జోక్యం చేసుకుని డ్రామా క్రియేట్ చేస్తాడని వారు అభిప్రాయపడ్డారు.
అయితే అన్నిటి కన్నా ముఖ్యంగా ఈ టాస్క్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రామకృష్ణ అడ్డుకోవడంతో షాలినిని పక్కకు తోయాల్సి రాగా, దీన్ని షాలిని పెద్ద ఇష్యూ చేసి రామకృష్ణ తనను గట్టిగా తోశాడంటూ రోహిత్ దగ్గరికి వెళ్లి ఏడ్చింది. తాను కావాలని తోయలేదని, యాదృచ్చికంగా అలా జరిగిందని రామకృష్ణ ఎంత చెప్పినా షాలిని శాంతించకపోగా, చివరకు ఆమె కోపం తగ్గకపోవడంతో రామకృష్ణ ఏకంగా ఆమె కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యి కిందకు వంగాడు. అయినప్పటికీ షాలిని తగ్గకపోగా శివకుమార్ రంగంలోకి దిగి ఆ గొడవను సర్దుబాటు చేసే ప్రయత్నం చేయగా, షాలిని ప్రతి చిన్న దానికి ఇలా ఓవరాక్షన్ చేయడంపై హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వైల్డ్‌ఫైర్ సభ్యులు నేరుగా కెప్టెన్సీ కంటెండర్ల రేసులోకి వెళ్లే అవకాశం ఇవ్వగా, మిగిలిన రెండు టీమ్‌లు కెప్టెన్సీ రేసు కోసం పోటీ పడాలని బిగ్‌బాస్ సూచించారు. అయితే ఒక గేమ్‌లో కంటెస్టెంట్లు సరిగ్గా ఆడకపోవడంతో బిగ్‌బాస్ ఆ గేమ్‌ను రద్దు చేసి, మరో గేమ్‌ను నిర్వహించి ఎవరు కెప్టెన్సీకి అర్హులు, ఎవరు అర్హులు కాదనేది నిర్ణయించారు.
చూడబోతే ఈ వారాంతంలో కూడా నాగార్జున చేతిలో కంటెస్టెంట్స్ అందరికీ ఒక రౌండ్ క్లాస్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్స్ లో నాగార్జున ఇచ్చిన సలహాలు ఎవరూ పాటించలేదు. పైగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న విమర్శలు హద్దు దాటాయి కూడా! దీంతో అందరికీ గట్టి ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది.
