Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: హౌస్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు!

హౌస్‌లో రోహిత్ మరియు త్రిగుణ్‌ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పటికీ, గొడవ మాత్రం తీవ్రరూపం దాల్చింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   20 Oct 2026 11:55 AM IST
Bigg Boss Telugu 10: హౌస్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు!
X

బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం మొదలైన నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. రోహిత్ కి త్రిగుణ్ కి గొడవలు, రోహిత్ కి శివ్ కి గొడవలు, రోహిత్ కి ముకేశ్ కి గొడవలు, నీతూ కి వర్షిణికి గొడవలు, నీతూ కి ముకేశ్ కి గొడవలు జరగడంతో హౌజ్ లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

గతంలో కెప్టెన్సీ టాస్క్ సమయంలో సుధీర్ తన కుటుంబం మీద ఒట్టు వేసి ఆడానని రోహిత్ చెప్పగా, ఆ తర్వాత మాట తప్పడంపై రోహిత్ తీవ్రంగా నిలదీశాడు. ఆ సమయంలో సుధీర్ సమాధానం చెప్పలేక, పక్కనే ఉన్న ముఖేష్, వర్షిణి, రామ్‌ప్రసాద్, నరేష్‌లను తన కుటుంబంగా పేర్కొంటూ వారి భుజాలపై చేయి వేశాడు. అప్పుడు మౌనంగా ఉన్న ముఖేష్, వర్షిణిలు తాజాగా సుధీర్ తీరును తప్పు పట్టారు. రోహిత్ ప్రశ్నించినప్పుడు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు సుధీర్ అలా అనడంపై విమర్శలు గుప్పించారు.

హౌస్‌లో రోహిత్ మరియు త్రిగుణ్‌ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పటికీ, గొడవ మాత్రం తీవ్రరూపం దాల్చింది. త్రిగుణ్ రెచ్చగొట్టేలా మాట్లాడగా, రోహిత్ కోపంతో ఊగిపోతూ రౌడీయిజం తరహాలో వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. హౌస్‌లో గొడవలు ఎక్కడికక్కడ ముగించాలి కానీ, బయట చూసుకుంటామనే బెదిరింపులకు పాల్పడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నీతును వంశీ నామినేట్ చేశాడు. ఆ సమయంలో నీతు అనుకోకుండా తన సీటులో నుంచి తప్పుగా లేవబోతుండగా, ముఖేష్ బిగ్గరగా నవ్వుతూ ఆమెను ఎద్దేవా చేశాడు. ఈ వివాదం పెద్దదైపోవడంతో ముఖేష్ ఎలాంటి రిప్లై ఇవ్వలేకపోయాడు. దీంతో అవమానభారంతో నీతు తీవ్రంగా కన్నీరుమున్నీరుగా విలపించింది. నీతుకు మద్దతుగా రోహిత్ నిలవడం ఆమెకు ఊరటనిచ్చింది.

ఎవరి నామినేషన్ జరుగుతున్నా సరే, సంబంధం లేని వాళ్లంతా మధ్యలో దూరి అనవసరమైన వాదనలు చేయడం ఈ వారం నామినేషన్లలో ఎక్కువగా కనిపించింది. నరేష్ తన నామినేషన్ సమయంలో "ఇది నా నామినేషన్ బాబూ, మధ్యలోకి రావొద్దు" అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే హౌస్‌లో ఎంత గందరగోళం నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి సీక్రెట్ రూమ్ ట్విస్ట్, నామినేషన్ల వేడితో బిగ్‌బాస్ హౌస్ రాబోయే రోజుల్లో మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది!