ఈ వారం కూడా రోహిత్ కంబ్యాక్ ఇచ్చేలా లేడు!
ఇకపోతే నామినేషన్స్ ప్రక్రియలో కూడా రోహిత్ కి ఇతర హౌజ్మేట్స్ కి మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి.
By: Priya Chowdhary Nuthalapti | 13 Oct 2026 9:02 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం ఎంతో ఉద్రిక్తతలతో, తీవ్ర వాగ్వాదాలతో ప్రారంభమైంది. మొదటి రోజే హౌస్‌లో గొడవలు, అరుపులు తారస్థాయికి చేరగా, ఆట రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే నామినేషన్ల గురించి ఇతరులతో చర్చించకూడదు అని నాగార్జున హెచ్చరించినప్పటికీ షాలిని తన పంథా మార్చుకోలేదు. రోహిత్ కూడా తన ఆట మీద నుంచి దృష్టి మరల్చి పూర్తిగా షాలిని మీద ఫోకస్ పెడుతున్నాడు.
ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో మొదటి హైలైట్ త్రిగుణ్ కి రోహిత్ కి మధ్య జరిగిన గొడవ. ఫుడ్ విషయంలో ఇద్దరి తీవ్ర వాగ్వాదం జరిగి ఇద్దరూ పరస్పరం విమర్శించుకోగా, ఈ గొడవలోకి సుధీర్ కెప్టెన్ హోదాలో జోక్యం చేసుకున్నప్పటికీ అది తనని టార్గెట్ చేయడానికే చేసినట్లు రోహిత్ ఫీల్ అయ్యాడు. నిజానికి ఇక్కడ రోహిత్ అనవసరంగా అరుస్తూ సుధీర్ కి కెప్టెన్ అనే గౌరవం కూడా ఇవ్వకుండా బిహేవ్ చేసాడు.
ఇకపోతే నామినేషన్స్ ప్రక్రియలో కూడా రోహిత్ కి ఇతర హౌజ్మేట్స్ కి మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి.
రోహిత్ మొదటి నామినేషన్‌గా వంశీని ఎంచుకోగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రోహిత్ పెట్టిన పాయింట్స్ అంత గొప్పగా అనిపించకపోయినా వంశీ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అంతే కాకుండా, రెండో నామినేషన్‌లో ఝాన్సీని నామినేట్ చేస్తూ బిగ్‌బాస్ రూల్స్ సరిగ్గా ఫాలో కాలేదని వాదించాడు. అయితే శివ తన పవర్‌ను ఉపయోగించి ఝాన్సీ నామినేషన్‌ను రద్దు చేసాడు..
ఇంకో పక్కన ముకేశ్ నామినేషన్స్ లో భాగంగా, గత వారం అమన్ ఉపయోగించిన బూతు మాటను ప్రస్తావిస్తూ అతన్ని నామినేట్ చేసాడు. ఈ గొడవతో సంబంధం లేకపోయినా త్రిగుణ్ మధ్యలోకి వచ్చి అమన్‌తో గొడవకు దిగడం విశేషం కాగా, ముఖేష్, త్రిగుణ్‌లు కావాలనే అమన్‌ను టార్గెట్ చేస్తున్నారని స్పష్టమైంది.
అంతేకాకుండా ముఖేష్ తన రెండో నామినేషన్‌లో షాలినిని ఎంచుకుంటూ ఆమె ఆట ఇంప్రూవ్ కావాలని అనడంతో షాలిని ఫైర్ అయ్యింది. ఈ తరుణంలో శ్వేత అమన్‌కు కీలక సలహాలు ఇస్తూ, గొడవ నువ్వు మొదలుపెట్టకపోయినా నీ గొంతు, కోపమే ఎక్కువగా హైలైట్ అవుతోందని, తప్పు అవతలి వారిదైనా నీదే అయినట్లు ప్రొజెక్ట్ అవుతోందని చెప్పి హితవు పలికింది.
ఇదిలా ఉండగా, ఎప్పుడూ లేనిది అనవసరంగా కోపం తెచ్చుకుంటూ రోహిత్ తన ఆట మీద నుంచి పూర్తిగా దృష్టి మరల్చడంతో, అతను ఈ వారం కూడా కంబ్యాక్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.
