Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ఆరో వారం కెప్టెన్‌గా రామ్‌ప్రసాద్ విజయం

బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం కెప్టెన్సీ టాస్క్లో అనూహ్యంగా రాంప్రసాద్ గెలుపొందాడు. ఎంతో ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో ఎట్టకేలకు రామ్‌ప్రసాద్ కొత్త కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Oct 2026 8:41 PM IST
Bigg Boss Telugu 10: ఆరో వారం కెప్టెన్‌గా రామ్‌ప్రసాద్ విజయం
X

బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం కెప్టెన్సీ టాస్క్లో అనూహ్యంగా రాంప్రసాద్ గెలుపొందాడు. ఎంతో ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోరులో ఎట్టకేలకు రామ్‌ప్రసాద్ కొత్త కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. హౌజ్ లోకి వచినప్పటి నుంచి కెప్టెన్ అవ్వాలని చెప్తూ వచ్చిన రాంప్రసాద్ మొత్తానికి ఈసారి కెప్టెన్ అయ్యాడు.

అయితే కెప్టెన్సీ టాస్క్‌లలో గ్రీన్ టీమ్ ఎలాగైనా తమ గ్రూప్ నుంచి ఒకరిని కెప్టెన్ చేయాలనే కసితో ఆడింది. అయితే వాళ్ళు అంత కసిగా ఆడటానికి ఇంకో కారణం ఏంటంటే, రోహిత్ - షాలిని జంటకు అసలు కెప్టెన్సీ దక్కకూడదనే ఏకైక లక్ష్యం. ఈ క్రమంలోనే ఫెయిర్‌గా ఆడితే వైల్డ్ కార్డ్ టీమ్ గెలిచేదని, కానీ అవతలి వారు కావాలనే మోసం చేశారని శివ మండిపడ్డాడు.

అయితే ఈ గేమ్ మొత్తాన్ని మార్చింది మాత్రం త్రిగుణ్. టాస్క్‌లు ముగిసిన తర్వాత బ్లూ టీమ్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఎప్పుడైనా నిజాయితీగా ఆడి గెలవాలి అంటూ సుధీర్‌ను రోహిత్ నిలదీశాడు. దీనికి సుధీర్ సమాధానం ఇస్తూ, గతంలో తాను నిజాయితీగా ఆడుతానని కుటుంబం మీద ఒట్టేసినా, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోయానని చెప్పకనే ఒప్పుకున్నాడు.

గ్రీన్ టీమ్ కావాలనే మోసం చేసి ఆడిందని, త్రిగుణ్ కూడా రోహిత్‌కు కెప్టెన్సీ రాకుండా కావాలనే మ్యాచ్‌లను త్యాగం చేశాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే త్రిగుణ్ నలుగురి దగ్గర నాలుగు కారణాలు చెప్పాడు కానీ రోహిత్ మీద ఉన్న కోపంతోనే ఇలా చేసాడు.

అన్ని టాస్క్‌లలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా బిగ్‌బాస్ తుది కెప్టెన్సీ రేసు కంటెండర్లను ప్రకటించారు. వైల్డ్ కార్డ్ నుంచి ఓడిపోయినప్పటికీ మంచి పాయింట్లు సాధించిన శివతో పాటు.. ముఖేష్, వర్షిణి, వంశీ, రామ్‌ప్రసాద్, అమన్, ఝాన్సీలు కెప్టెన్సీ రేసులోకి అడుగుపెట్టారు. చివరకు ముఖేష్ మరియు రామ్‌ప్రసాద్‌లు మాత్రమే చివరి వరకు నిలబడ్డారు.

ఎవరికి వారు కెప్టెన్ కావాలని ప్రయత్నించినప్పటికీ, చివరి నిమిషంలో జరిగిన పరిణామాలు రామ్‌ప్రసాద్‌కు కలిసొచ్చాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా రామ్‌ప్రసాద్ ఆరో వారపు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుధీర్ చేతుల మీదుగా ఆయన కెప్టెన్సీ బ్యాండ్‌ను స్వీకరించాడు.