Bigg Boss Telugu 10: నామినేషన్ల రెండో రోజు.. వ్యక్తిగత విమర్శలు, రోహిత్‌పై టార్గెట్..
నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య, వ్యక్తిగత విమర్శలతో ప్రారంభమైంది.
By: Priya Chowdhary Nuthalapti | 7 Oct 2026 9:15 AM ISTనామినేషన్ల ప్రక్రియ రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య, వ్యక్తిగత విమర్శలతో ప్రారంభమైంది. గత బిగ్‌బాస్ షోలలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యులు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ నామినేషన్లలో హౌస్‌లోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయినట్లు కనిపించగా, ఎక్కువ శాతం రోహిత్‌ను టార్గెట్ చేయడం గమనార్హం.
సుధీర్ నేరుగా రోహిత్‌ను నామినేట్ చేయడమే కాకుండా చాలా ఎక్కువగా ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది. అయితే ఈ సారి రోహిత్ కూడా తిరిగి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసాడు. సుధీర్ అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తుండగా, "నువ్వు నా రేంజ్ కాదు" అంటూ రోహిత్ బదులిచ్చాడు. దీనికి సుధీర్ కౌంటర్ ఇస్తూ, బిగ్‌బాస్‌ను రోహిత్ తిట్టాడని వీకెండ్ ముగిసిపోయిన విషయం గురించి తిరిగి ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో రోహిత్ డిఫెన్స్‌లో పడగా, పక్కనే ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, వంశీ తదితరులు పెద్దగా నవ్వడం చూడ్డానికి చాలా చిరాకు తెప్పించింది. అంతే కాదు, సెలెబ్రిటీస్ లో ఎవరు నామినేషన్ చేస్తున్నా, వేరే వాళ్ళు చప్పట్లు కొట్టడం, ఇటు పక్క కామనర్స్ కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ నామినేషన్స్ చేసుకోవడం చూడ్డానికి తల నొప్పి తెప్పించే వ్యవహారంగా మారింది.
ఇక ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ల విషయానికి వస్తే, ఈ ప్రక్రియ ముగిసేసరికి ఈ వారం ఎలిమినేషన్ బరిలో నిలిచిన కంటెస్టెంట్లు వీరే: అమన్, అపూర్వ, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, చరణ్, నరేష్, షాలిని, రామ్ ప్రసాద్, త్రిగుణ్.
ఈ నామినేషన్ ప్రక్రియపై, పర్సనల్ అటాక్స్ చేసిన వారిపై హోస్ట్ నాగార్జున రాబోయే వారంలో గట్టిగా క్లాస్ పీకడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరగకపోతే ఈ సెలెబ్రిటీస్ ఇంకా రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. దాని వల్ల కామనర్స్ కి సింపతీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
