Begin typing your search above and press return to search.

ఈ వారం కామనర్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్టేనా?

ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి.

By:  Priya Chowdhary Nuthalapti   |   1 Oct 2026 9:11 AM IST
ఈ వారం కామనర్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్టేనా?
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఎంతో ఆసక్తికరంగా, రసాభాసగా సాగుతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ల విషయంలో బిగ్‌బాస్ ఇస్తున్న ట్విస్ట్‌లు ప్రేక్షకులను విస్మయిస్తున్నాయి. మొదటి వారంలో చైత్రా రాయ్, రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్ కాగా, మూడో వారంలో వంశీ లేదా వర్షిణి ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేసి వారిద్దరినీ కాపాడాడు.

అయితే ఈ వారం కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ తీవ్ర వాగ్వాదాలకు దిగారు. ముఖ్యంగా ఈ వారం నామినేషన్లలో మిథిలేష్ కాంట్రిబ్యూషన్ గురించిన చర్చ కూడా వచ్చింది. దీనికి తోడు ముఖేష్, త్రిగుణ్, సృష్టిలను టార్గెట్ చేస్తూ చాలా మంది నామినేట్ చేశారు. కంటెస్టెంట్లు తమ పాయింట్లు గట్టిగా వినిపిస్తూ హోరాహోరీగా నామినేషన్లు పూర్తి చేశారు.

గత వారంలో ముఖేష్ తన కెప్టెన్సీని వదులుకుని కొందరిని కాపాడుతూ నేరుగా నామినేషన్లలోకి వచ్చాడు. ఆయనతో పాటు ఈ నాలుగో వారానికి సంబంధించి మొత్తం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారని స్వయంగా బిగ్‌బాస్ ప్రకటించారు.

ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి.

ఈ జాబితాను పరిశీలిస్తే హౌస్‌లో విపరీతమైన కంటెంట్ ఇస్తున్న టాప్ కంటెస్టెంట్లు అందరూ ఈసారి నామినేషన్లలో ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా అగ్ని పరీక్ష షో కంటెస్టెంట్స్ అందరూ దాదాపుగా నామినేషన్స్ లో ఉండటం తో ఈ సారి కచ్చితంగా ఒక కామనర్ ఎలిమినేటి అయ్యే అవకాశం ఉంది.

ఇంకో పక్కన అపూర్వ కెప్టెన్ అయినందువల్ల నామినేషన్స్ ని తప్పించుకుంది కానీ ఆమెకి వచ్చే వారం డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే అనిపిస్తుంది. ఇకపోతే మొదటి రెండు వారాల్లో సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ ఇంటికి నుంచి బయటకు వెళ్లిపోవడంతో, ఈ సారి సెలెబ్రిటీ వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు. ముకేశ్ కి దెబ్జానీ కి త్రిగుణ్ కి ఫాలోయింగ్ ఎక్కువే ఉన్న కారణంగా వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. వంశీ డేంజర్ జోన్ లో ఉండచ్చేమో కానీ అతను ఈ వారం బాగా ఆడటంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువే.