Bigg Boss Telugu 10: త్రిగుణ్ వర్షిణిల మధ్యలో ముకేశ్ కామెడీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈసారి నామినేషన్స్లో వర్షిణి, త్రిగుణ్ కలిసి చేసిన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు కామెడీగా అనిపించింది.
By: Priya Chowdhary Nuthalapti | 28 Oct 2026 9:10 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈసారి నామినేషన్స్లో వర్షిణి, త్రిగుణ్ కలిసి చేసిన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు కామెడీగా అనిపించింది. వర్షిణిని నామినేట్ చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రవర్తించింది. త్రిగుణ్ కూడా తక్కువ తినకుండా తన వాదనను వినిపించాడు. వర్షిణి తనను ఎందుకు నామినేట్ చేశావని నిలదీయగా, త్రిగుణ్ అసలు విషయం బయట పెట్టాడు.
ముఖ్యంగా ముఖేష్ వెళ్లి దెబ్జానీతో మాట్లాడుతూ.. త్రిగుణ్‌కు, వర్షిణికి మధ్య ఒక డీల్ కుదిరిందని, అందుకే వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు నామినేట్ చేసుకోరని చెప్పాడని త్రిగుణ్ వివరించాడు. ఆ మాట విన్న వర్షిణి వెంటనే ముఖేష్‌ను పిలిచి అడుగుదామని అనగా, త్రిగుణ్ మాత్రం తనకు సరిగ్గా గుర్తు లేదని దాటవేశాడు. అసలు తమ మధ్య అలాంటి డీల్ ఏదీ లేదని, కేవలం ఫెయిర్‌గా ఆడదామని మాత్రమే మాట్లాడుకున్నామని వర్షిణి స్పష్టం చేసింది.
తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తానని చెప్పి వర్షిణి నేరుగా ముఖేష్ దగ్గరకు వెళ్లింది. ముఖేష్‌ను గట్టిగా నిలదీస్తూ.. త్రిగుణ్ తనను నామినేట్ చేయడని, తమ మధ్య డీల్ ఉందని నువ్వే చెప్పావా అని నిలదీసింది. దానికి ముఖేష్ తాను ఎప్పుడూ అలా చెప్పలేదని బుకాయించాడు.
అప్పుడు త్రిగుణ్ జోక్యం చేసుకుని.. దెబ్జానీతో నువ్వు ఆ మాట అనలేదా అని ప్రశ్నించాడు. తాను ఎప్పుడైనా నీతో ఆ మాట అన్నానా అని ముఖేష్ ఎదురుదాడికి దిగాడు. దమ్ముంటే దెబ్జానీని పిలిచి అడుగు అని సవాల్ విసిరాడు. వర్షిణి తనను పిలిచినట్లే, అందరి ముందు తనను గట్టిగా పిలిచి మాట్లాడాలని ముఖేష్ అనడంతో అక్కడ మరింత రచ్చ జరిగింది.
వర్షిణి స్పందిస్తూ.. తాను గట్టిగా పిలిస్తే నీకెందుకు అంత సమస్య అని నిలదీసింది. ఇంతలో దెబ్జానీ అక్కడికి రావడంతో అసలు నిజం బయటపడింది. త్రిగుణ్, వర్షిణిల మధ్య డీల్ ఉందనే విషయం ముఖేష్ మామూలు మాటల మధ్యలో చెప్పాడని, అది అంత సీరియస్ విషయం కాదని దెబ్జానీ క్లారిటీ ఇచ్చింది. ముఖేష్ కావాలనే ఈ గొడవకు తెరలేపాడని, అన్నీ తానే అయి ఈ డ్రామా నడిపాడని ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది.
