Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ చరిత్ర ని తిరగరాసిన కంటెస్టెంట్ మిథిలేష్

బిగ్‌బాస్ మూడో వారానికి సంబంధించిన "టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్" థీమ్‌కు తగ్గట్టుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   27 Sept 2026 9:29 AM IST
బిగ్ బాస్ చరిత్ర ని తిరగరాసిన కంటెస్టెంట్ మిథిలేష్
X

బిగ్‌బాస్ మూడో వారానికి సంబంధించిన "టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్" థీమ్‌కు తగ్గట్టుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కంటెస్టెంట్లను ప్రలోభ పెట్టడానికి నిర్వాహకులు ఏకంగా 15 లక్షల రూపాలయ బ్రీఫ్‌కేస్‌ను ముందుంచారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మిథిలేష్ అనూహ్యంగా, అలవోకగా ఆ డబ్బును తీసుకుని షో నుంచి బయటికి వచ్చేందుకు అంగీకరించాడు.

బిగ్‌బాస్ చరిత్రలో ఇలా డబ్బుతో ఆఫర్ ఇవ్వడం, అది కూడా ఎంట్రీ ఇచ్చిన ఒక్కరోజే మిథిలేష్ దాన్ని తీసుకోవడం ఇదే మొదటి సారి. కేవలం ఒక్క రోజు ప్రయాణానికి 15 లక్షల భారీ మొత్తాన్ని అందుకోవడం అంటే మాములు విషయం కాదు. బిగ్ బాస్ షో మొదలు పెట్టిన తొమ్మిదేళ్లలో ఈ విధంగా ఇప్పటి వరకు జరిగింది లేదు. ఫర్ ది ఫస్ట్ టైం, ఇలాంటి ఒక ప్రక్రియ మూడో వారం లోనే జరగడం, అది కూడా సక్సెస్ అవ్వడం ఈ సారి మాత్రమే జరిగింది.

మిథిలేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, ఆయన తీసుకున్నది వంద శాతం సరైన నిర్ణయమే. హౌజ్ లో కొంత మంది మిథిలేష్ ని వద్దు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు కానీ అతను మాత్రం కరెక్ట్ స్టెప్ వేసాడు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

హస్‌లో ఇప్పటికే ఉన్న సమీకరణాల దృష్ట్యా, ప్రేక్షకులకు విన్నర్ ఎవరో ఒక అంచనా వచ్చేసిందని మిథిలేష్ గ్రహించాడు. ఈ సమీకరణాలను తాను మార్చలేనని భావించి, వచ్చే డబ్బును ఎగరేసుకుపోవడమే స్మార్ట్ మూవ్ అని భావించాడు. సాధారణంగా హౌస్‌లో ఉంటే అతనికి వారానికి 75 వేలు వస్తాయని సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. కానీ అతను ఎన్ని వారాలు ఉన్నా గెలవడం కష్టమే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

'అగ్నిపరీక్ష' షో ద్వారా ఇప్పటికే మంచి రీచ్, ఫేమ్ సంపాదించుకున్న మిథిలేష్... ఇప్పుడు ఈ డబ్బు తీసుకునే నిర్ణయంతో అందరి దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు.