Begin typing your search above and press return to search.

శివాజీపై కృష్ణుడు కౌంటర్.. “ఆ దమ్ము ఉందా?” హాట్ టాపిక్

ముఖ్యంగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ తన ఆట తీరును విమర్శించిన తీరుపై కృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Madhu Reddy   |   28 Sept 2026 10:40 AM IST
శివాజీపై కృష్ణుడు కౌంటర్.. “ఆ దమ్ము ఉందా?” హాట్ టాపిక్
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుండి రెండవ వారంలోనే ఎలిమినేట్ అయిన ప్రముఖ నటుడు కృష్ణుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ తన ఆట తీరును విమర్శించిన తీరుపై కృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "శివాజీ నన్ను కాబట్టి అన్ని మాటలు అన్నాడు.. ఏ స్టార్ హీరోనైనా అలా అనగలడా?" అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆటలో ఫెయిల్ కావడానికి కారణం అదే :

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన ఎలిమినేషన్‌పై కృష్ణుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. తాను టాస్క్‌లలో సరిగ్గా ఆడలేకపోయానని, అందుకే ఎలిమినేట్ కావడానికి తానే అర్హుడినని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా సహకరించలేదని, ముఖ్యంగా షుగర్ మరియు స్వీట్లు పూర్తిగా మానేయడం వల్ల తీవ్రమైన నీరసం ఆవహించి సరిగ్గా గేమ్ ఆడలేకపోయానని తన బాధను పంచుకున్నారు.

శివాజీ వ్యాఖ్యలపై కృష్ణుడి కౌంటర్ :

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ తనను ఉద్దేశించి చేసిన విమర్శలపై కృష్ణుడు మండిపడ్డారు. ఎవరి జీవితంలోనైనా సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయని, అంతమాత్రాన తనను ఫెయిలయ్యాయని విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు. శివాజీ కెరీర్‌లో కూడా ఎన్నోసార్లు ఫ్లాప్స్ వచ్చాయని గుర్తుచేశారు. ఇక తాను మంచితనంతోనే ఎలాంటి బదులు ఇవ్వలేదని, కానీ తనను అన్నీ మాటలు అన్నప్పుడు ప్రేక్షకులు కూడా గమనించారని కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల మద్దతుపై స్పందన:

శివాజీ అలా విమర్శిస్తున్నప్పుడు తాను సైలెంట్‌గా ఉండటం చూసి బయట జనం చాలా మంది తనను ప్రశ్నించారని కృష్ణుడు తెలిపారు. "సార్ ఆయన అలా అంటుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని తనను చాలామంది అడిగారని చెప్పారు. నేను ఎంతో హుందాగా ఆయన అన్న మాటలను స్పోర్టివ్ గా తీసుకుంటాను. ఐన ప్రజలందరికీ అసలు ఏం జరుగుతుందో క్లారిటీగా తెలుసని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని, తనకు కూడా సరైన విజయం వస్తుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక బిగ్‌బాస్ హౌస్ అనుభవాలు, బయట జరిగిన విమర్శలపై కృష్ణుడు ఎంతో ఓపెన్‌గా తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఒక సీనియర్ నటుడిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, సహచర నటుడి వ్యాఖ్యలపై తన అసంతృప్తిని ఆయన నిర్మొహమాటంగా వెల్లడించడం ప్రస్తుతం టెలివిజన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.