డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషనే
శనివారం ఎపిసోడ్ లో కూడా స్రిష్టి ని కృష్ణుణ్ణి దూరంగా కూర్చోపెట్టి ఆట చూడమని చెప్పారు. వాళ్లిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు.
By: Priya Chowdhary Nuthalapti | 20 Sept 2026 11:14 AM ISTబిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన 16 మంది కంటెస్టెంట్లలో చైత్రా రాయ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి మొదట చైత్ర రాయ్ ని ఆ తర్వాత చరణ్ ని బయటకు పంపించేశారు. ఆ తర్వాత పవర్ ఆఫ్ పీపుల్ అనే థీమ్ తో రెండో వారం లో వెళ్లిపోయిన ఇద్దరి మధ్య వోటింగ్ పెట్టి, చరణ్ ని వెనక్కి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు రెండో వారంలో కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది.
ఈ రెండో వారం మొత్తంలో కృష్ణుడు, స్రిష్టి లాంటి కంటెస్టెంట్లు దాదాపుగా ఎక్కడా కనిపించలేదు. గత రెండు మూడు రోజులుగా వర్షిణి, స్రిష్టి, కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా, తాజా నివేదికల ప్రకారం కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. శనివారం ఎపిసోడ్ లో కూడా స్రిష్టి ని కృష్ణుణ్ణి దూరంగా కూర్చోపెట్టి ఆట చూడమని చెప్పారు. వాళ్లిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆట విషయానికి వస్తే, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కృష్ణుడు ఏ మాత్రం ప్రయత్నించినట్లు కనిపించలేదు. శారీరక ఇబ్బందులతో సతమతమవుతున్న అతను, బిగ్‌బాస్ హౌస్‌ను ఒక ఆటలా కాకుండా రిలాక్స్‌డ్ వెకేషన్‌లా భావిస్తూ చాలా లైట్‌గా తీసుకున్నాడు. హౌస్‌లో అతని వల్ల గేమ్ మీద ఎలాంటి ప్రభావం లేదని, షోకు కూడా పెద్దగా ఉపయోగం లేదని ప్రేక్షకులు భావించినట్లు స్పష్టమవుతోంది.
టాస్క్‌ల్లోనూ, ఇతర సంభాషణల్లోనూ కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. మొదటి వారంలో రెండు మూడు సందర్భాల్లో కాస్త కనిపించినా, రెండో వారంలో మాత్రం అతను ఒక్కసారి కూడా హైలైట్ కాలేదు. పైగా మొదటి నుంచీ కృష్ణుడికి ఓట్లు కూడా పెద్దగా రావడం లేదు. ఏదో మొదటి వారం లో కృష్ణుడు కాస్త అగ్రెసివ్ గా కనిపించినా రోహిత్ మీద కోపంగా ఎగబడినా, చివరికి అతను చప్పబడిపోయాడు. అతని నుంచి ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ విషయాలు స్క్రీన్ లో క్యాప్చర్ అవ్వడం లేదు కనుక ఇక కృష్ణుడు వెళ్లిపోవడమే సబబు అనిపిస్తుంది.
నిజానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండాల్సింది కానీ అనూహ్యంగా సింగిల్ ఎలిమినేషన్ కి సెటిల్ అయ్యారు బిగ్ బాస్ టీమ్.
