పాపం ఝాన్సీ.. కెప్టెన్స్ పోయింది.. కోటింగ్ పడింది
హౌస్‌లో తొలిసారి కెప్టెన్ అవుదామనుకున్న ఆమె కల చెదిరిపోవడంతో పాటు, వచ్చే వారం కూడా మళ్ళీ కెప్టెన్సీ రేసులోనే ఉండాల్సి వచ్చింది.
By: Priya Chowdhary Nuthalapti | 10 Oct 2026 3:42 PM ISTవీకెండ్‌కు ముందు బిగ్‌బాస్ హౌస్‌లో ఆసక్తికరమైన సవాళ్లు, ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. వీకెండ్ నామినేషన్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఒక ఛాలెంజ్ విసిరి, పాయింట్లు తక్కువగా ఉన్న రెండు జట్లు ఈ రేసులో పోటీ పడాలని మరియు ప్రతి టీమ్ నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలనే ట్విస్ట్ ఇచ్చారు. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముఖేష్-ఝాన్సీ మరియు రోహిత్-షాలిని జట్ల నుంచి ఇద్దరు బయటకు రావలసి రాగా, చర్చించుకున్న ఆ రెండు జట్ల నుంచి రోహిత్, ఝాన్సీలు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు.
ఇక్కడే ఝాన్సీ తన వ్యూహాత్మక మైండ్ పవర్ ఉపయోగించి మ్యాజిక్ కీని ఉపయోగిస్తున్నానని బిగ్‌బాస్‌కు చెప్పి వెంటనే సేఫ్ అవ్వడంతో షాలిని పూర్తిగా రిస్క్‌లో పడింది. అయితే ఝాన్సీ మాజిక్ కీ ఉపయోగించి డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నానని భావించినా, బిగ్‌బాస్ ఆమెకు ఊహించని షాక్ ఇస్తూ నువ్వు సేఫ్ అయ్యావు కానీ కెప్టెన్సీ రేసులో ఉండకూడదని చెప్పారు.
తాను కేవలం కెప్టెన్సీ కోసమే ఆ కీ ఉపయోగించానని ఝాన్సీ చెప్పినా లాభం లేకపోయింది. ఆ కీ కేవలం ఎవిక్షన్ నుండి రక్షణకు మాత్రమే వర్తిస్తుందని తెలియడంతో ఝాన్సీ ఆశలు ఆవిరైపోయి తీవ్ర నిరాశకు గురైంది. అంతే కాకుండా, ఆ పవర్ వాడేటప్పుడు, దాన్ని తన కోసమైనా లేదంటే వేరే ఇంకొకరి కోసమైనా ఉపయోగించవచ్చన్న విషయం కూడా బిగ్ బాస్ చెప్పారు.
హౌస్‌లో తొలిసారి కెప్టెన్ అవుదామనుకున్న ఆమె కల చెదిరిపోవడంతో పాటు, వచ్చే వారం కూడా మళ్ళీ కెప్టెన్సీ రేసులోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఈ వారాంతం ఝాన్సీకి గట్టి క్లాస్ పడే అవకాశం ఉందనిపిస్తుంది. ఇప్పటికే వచ్చిన ప్రోమో లో నాగార్జున ఒక వీడియో ప్లే చేసి, ఝాన్సీ చీటింగ్ చేసి ఆడిన విధానం చూపిస్తూ, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కల్మషం లేకుండా ఉంటారని, స్వచ్ఛంగా ఉంటారని అనుకుంటే ఇలా ఝాన్సీ మోసం చేసి ఆ అభిప్రాయాన్ని టూపీడిపేసింది అని కాస్త స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
ప్రోమో ప్రకారం, నాగార్జున అన్న మాటలకి ఝాన్సీ వెంటనే కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఈ ప్రభావం కాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం తీసుకొస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
