Begin typing your search above and press return to search.

ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేటి అయ్యేది ఎవరు?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టాస్క్‌లు, నామినేషన్ల గొడవలతో హౌస్ హీటెక్కుతోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   25 Sept 2026 9:21 AM IST
ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేటి అయ్యేది ఎవరు?
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టాస్క్‌లు, నామినేషన్ల గొడవలతో హౌస్ హీటెక్కుతోంది. మొదటి రెండు వారాల్లో సెలబ్రిటీ కంటెస్టెంట్లు చైత్రా రాయ్, కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ సరికొత్త మలుపు తిరగనున్నట్లు బిగ్‌బాస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తాజా విశ్లేషణల ప్రకారం, ఈ వారం ఒక కామన్ కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొదటి రెండు వారాలతో పోలిస్తే, సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఇప్పుడు తమ ఆటతీరును చాలా వరకు మెరుగు పరుచుకున్నారు. వారు గేమ్‌పై పూర్తి దృష్టి సారించి వ్యూహాత్మకంగా ఆడుతున్నారు. సెలబ్రిటీలు స్ట్రాంగ్ అవ్వడంతో ఆ ప్రభావం కామన్ కంటెస్టెంట్లపై స్పష్టంగా పడుతోంది.

ముఖ్యంగా ఈ వారం స్రిష్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నెట్టింట టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఆమె ఎలిమినేషన్ రిస్క్ నుంచి బయట పడి కెప్టెన్సీ కంటెండర్ ఐంది. ఎలాగో ఎలిమినేషన్స్ లో లేదు కాబట్టి, ఆమె ఈ వారం సేఫ్. కాకపోతే ఝాన్సీ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడిపోయింది. ఝాన్సీ కెప్టెన్ అయినప్పటికీ ఆమెకి ఇమ్యూనిటీ లేదు. ఈ సారి మళ్ళీ కెప్టెన్ అయినా, తక్కువ ఓట్లు వస్తే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే.

దీనికి తోడు హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావిడి మొదలైంది. 'అగ్ని పరీక్ష' షో నుంచి కొత్త కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆట మరింత కఠినంగా మారనుంది. కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్‌లో ఉన్న వారిపై, ముఖ్యంగా ఆటలో వెనుకబడిన కామన్ కంటెస్టెంట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొనడం ఖాయం.

ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, మూడో వారం ఎలిమినేషన్ కత్తి ఝాన్సీ పైనే వేలాడుతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది? నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో ఇంకేమైనా ఊహించని ట్విస్ట్ ఇస్తారా? మనం వేచి చూడాలి.