అదరగొట్టిన ఝాన్సీ.. బిగ్‌బాస్ 10 మొదటి కెప్టెన్
బిగ్‌బాస్ సీజన్ 10లో 12వ రోజు రసవత్తరంగా సాగిన కెప్టెన్సీ పోరులో రైతు బిడ్డ ఝాన్సీ విజేతగా నిలిచి, హౌస్‌కు తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
By: Priya Chowdhary Nuthalapti | 19 Sept 2026 9:14 AM ISTబిగ్‌బాస్ సీజన్ 10లో 12వ రోజు రసవత్తరంగా సాగిన కెప్టెన్సీ పోరులో రైతు బిడ్డ ఝాన్సీ విజేతగా నిలిచి, హౌస్‌కు తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. అసలు హౌజ్ లో ఝాన్సీ కెప్టెన్ అవ్వాలని ఎవరికి లేకపోయినప్పటికీ, ఆమెకి సపోర్ట్ అంతంతమాత్రమే ఉన్నప్పటికీ, అన్నిటినీ తట్టుకుని చివరికి కెప్టెన్ అవతారం ఎత్తింది.
తొలి కెప్టెన్సీ రేసులో ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పోటీపడ్డారు. ఈ గేమ్ ఏంటంటే, కంటెండర్లు ఐదుగురూ జైలులో ఉంటారు. గేట్లు తెరుచుకోగానే వీరు గోడ దూకి అవతలి సేఫ్ జోన్‌లోకి చేరుకోవాలి. మిగిలిన ఇంటి సభ్యులు గార్డులుగా వ్యవహరిస్తూ కంటెండర్లని గోడ దూకకుండా ఆపాలి.
మొదటి రౌండ్ లో వర్షిణి, నరేష్, దేబ్జానీ ప్రధానంగా షాలినిని లక్ష్యంగా చేసుకున్నారు. రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్‌లు సులభంగా గోడ దూకేశారు. ఝాన్సీని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, షాలినిపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఆమె తప్పించుకుంది. అదే ఆమెకి ప్లస్ పాయింట్ గా మారింది.
తర్వాతి రౌండ్లలో ముఖేష్, త్రిగుణ్‌లు కూడా ఎలిమినేట్ అవ్వడంతో ఆఖరి పోరు ఝాన్సీ, రామ్ ప్రసాద్ మధ్య నిలిచింది. ఫైనల్ రౌండ్‌లో కట్టర్‌తో ఫెన్సింగ్‌ను తొలగించి, అవతలి వైపునకు వెళ్లి కెప్టెన్సీ జెండాను ఎవరు ముందుగా ఎగురవేస్తే వారే విజేతగా నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టాస్క్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఝాన్సీ, సీజన్ 10 మొట్టమొదటి కెప్టెన్ బ్యాడ్జ్‌ను కైవసం చేసుకుంది.
పైగా ఈ ఫైనల్ రౌండ్ కూడా ఝాన్సీ కి ఈజీగా ఉండేలా రూపుదిద్దడం తో అనూహ్యంగా ఆమె విజయం సాధించింది. హౌజ్ మొత్తం లో ముకేశ్ తప్ప ఝాన్సీ గెలుపు ని ఇంకెవరూ ఆనందించలేక పోతున్నారు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్ మొదటి కెప్టెన్ అయినందుకు మిగిలిన అగ్నిపరీక్ష సభ్యులు అంత సంతోషంగా లేరన్న విషయం తెలుస్తుంది. ఈ దశ లో ఇప్పటికైనా ఝాన్సీ లో ఉన్న ఆట తీరు ని రోహిత్ మరియు గ్రూప్ మెచ్చుకుంటుందా లేదా అని మనం వేచి చూడాలి.
ఇక ఝాన్సీ కెప్టెన్ కావడం తో, ఆమెకి ఇమ్యూనిటీ దొరకడం తో పాటు, కచ్చితంగా నామినేషన్స్ లో ఆమెకి ఏదో ఒక పవర్ ఉండేలా చూస్తాడు బిగ్ బాస్. అది మిగిలిన అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ కి అనుకూలంగా వాడుతోందా లేక వ్యతిరేకంగా వాడుతోందా అని వేచి చూడాలి.
