Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ షాక్: ఎలిమినేటి అవ్వబోతున్న టాప్ సెలెబ్రిటీ?

చరణ్ మహదేవ్ ఊహించని ఎలిమినేషన్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ఓటింగ్ గణాంకాల్లో కూడా ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   11 Sept 2026 12:41 PM IST
మైండ్ బ్లాక్ షాక్: ఎలిమినేటి అవ్వబోతున్న టాప్ సెలెబ్రిటీ?
X

బిగ్ బాస్ తెలుగు 10 మొదటి వారం ఊహించని మలుపులతో కొనసాగుతోంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్‌లో.. మొదటి వారం నుంచే నామినేషన్లు, టాస్క్‌లు, గొడవలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే త్రిగుణ్ కి రోహిత్ కి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ సీజన్ మీద ఆసక్తి రేపుతోంది. పైగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని పెట్టి చరణ్ ని కూడా ఇంటికి పంపిస్తున్నారు. ఇన్ని షాకుల మధ్య ఇంకొక సెలెబ్రిటీ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని ఇప్పటికే సోషల్ మీడియా లో డిస్కషన్ జరుగుతుంది.

చరణ్ మహదేవ్ ఊహించని ఎలిమినేషన్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ఓటింగ్ గణాంకాల్లో కూడా ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక కామన్ కంటెస్టెంట్ ప్రయాణం మొదటి వారంలోనే ముగిసింది. చరణ్ ఎలిమినేషన్ తర్వాత తాజా అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, టాప్ పొజిషన్స్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్ అకస్మాత్తుగా రెండో స్థానానికి చేరుకోవడం ఆసక్తికరం.

డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు: వంశీ కృష్ణ, శివ స్రష్టి వ్యాకరణం, కృష్ణుడు, వర్షిణి సౌందరాజన్, సుధీర్ రెడ్డి. అయితే వంశీ కృష్ణ ఇప్పటికే పర్మనెంట్ హౌజ్మేట్ గా తన స్థానం పదిలపరుచుకున్నందున, అతను డెంజర్ జోన్ లో నుంచి బయటకు వచ్చినట్టే. కాకపోతే వర్షిణి సుధీర్ ఇద్దరూ ఆఖరి రెండు స్థానాల్లో ఉండగా, సోషల్ మీడియా లో వర్షిణి ఎలిమినేటి అయింది అనే వార్త హల్చల్ చేస్తుంది.

చరణ్ ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్‌లో కనిపిస్తున్న మార్పులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న ముఖేష్‌ను ఇప్పుడు త్రిగుణ్ అధిగమించాడు. మరో వైపు ముఖేష్, రాంప్రసాద్ కూడా కేవలం స్వల్ప తేడాతోనే వెనుకబడి ఉన్నారు. ఎవరి ఓట్లు ఎవరికి బదిలీ అయ్యాయో అధికారికంగా నిర్ధారించలేకపోయినా, చరణ్ ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్ సరళిలో మార్పు వచ్చిందనడం వాస్తవం.

అయితే, ఓటింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున ఈ లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.