ఎల్లుండే బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం.. ఫైనల్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!
ఎక్కడో బిగ్ బ్రదర్ పేరిట పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభమై.. యావత్ దేశ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
By: Madhu Reddy | 4 Sept 2026 2:27 PM ISTఎక్కడో బిగ్ బ్రదర్ పేరిట పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభమై.. యావత్ దేశ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రతి భాషలో బిగ్ బాస్ రియాలిటీ షోలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మిగతా భాషలతో పోల్చుకుంటే టాలీవుడ్ లో ఇప్పుడు పదవ సీజన్ సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు చాలా గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కొంతమంది సెలబ్రిటీల పేర్లు తెరపైకి రాగా.. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పాల్గొనబోయే ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ మరో లిస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సాధారణంగా ప్రతి సీజన్లో కూడా 10 నుండి 15 మంది వరకు సెలబ్రిటీలు.. 5 మంది లేదా ఆరు మంది కామన్ పీపుల్స్ హౌస్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దశావతారంలో మాత్రం 6 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ పీపుల్స్ ను హౌస్ లోకి తీసుకోబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. మరొకవైపు కాదు ఈసారి పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ పీపుల్స్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారంటూ వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీ జాబితా వైరల్ గా మారింది.
అందులో టెంపర్ వంశీ, దేబ్జానీ మోదక్, వర్షిని సౌందరరాజన్ , జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, ముఖేష్ గౌడ, చైత్ర రాయ్, ఆదిత్ ఈశ్వరన్ , కృష్ణుడు, సుధీర్ వంటి పోటీదారుల పేర్లు ఖరారు అయ్యాయట. ఈ జాబితాలో సినిమా నటీనటులు , టెలివిజన్ ప్రముఖులు, ప్రముఖ హాస్యనటులు ఉండడం విశేషం. విభిన్న వ్యక్తిత్వాలు, నేపథ్యాలు కలిగిన ఈ వైవిద్య భరితమైన బృందం ఫైనల్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరోవైపు కామన్ పీపుల్ కేటగిరీలో.. 6 మందిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఝాన్సీ ఫైనల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన ఆ 5 మందిని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
అసలే తెలుగు బిగ్ బాస్ సీజన్లలో ఈ పదవ సీజన్ మైలురాయి సీజన్ కావడంతో హోస్ట్ నాగార్జున ఈ రియాలిటీ షో పై ఊహించని పాపులారిటీ పెంచేస్తున్నారు. ముఖ్యంగా 10 రెట్ల వినోదం అంటూ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊహించని డ్రామా, సర్ప్రైజ్లు , సవాళ్లతో ఈసారి ప్రేక్షకులకు అంతకుమించి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని బిగ్ బాస్ వాగ్దానం చేస్తోంది. మరి సీజన్ పై అంచనాలు పెంచుతున్నట్టుగానే.. ఇక ఈ సీజన్ ఎలాంటి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
