Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: నాలుగో వారంలో డేంజర్ జోన్లో ఉన్నదెవరో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లో ఈ వారం ఆట రసవత్తరంగా సాగింది. మొదటి రోజు నుంచే గొడవలతో కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   3 Oct 2026 9:33 AM IST
Bigg Boss Telugu 10: నాలుగో వారంలో డేంజర్ జోన్లో ఉన్నదెవరో తెలుసా?
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లో ఈ వారం ఆట రసవత్తరంగా సాగింది. మొదటి రోజు నుంచే గొడవలతో కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక షో విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని, నాలుగో వారం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఎలిమినేషన్ మీద ఆసక్తి నెలకొంది. మొదటి వారంలో చైత్ర, రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేయడం వల్ల ఎలిమినేషన్ రద్దయింది.

దీనితో ఈ నాలుగో వారంలో 'డబుల్ ఎలిమినేషన్' ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరికొంత ముందేమో కచ్చితంగా అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఎలిమినేటి అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

ఈ నాలుగో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు పబ్లిక్ ఓటింగ్ బరిలో నిలిచారు. త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ, చరణ్ మహదేవ్, జబర్దస్త్ నరేష్, షాలిని దామెర, దేబ్జానీ మోదక్, అమన్ మసూద్ మరియు సృష్టి వ్యాకరణం ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. రోహిత్ భారీ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకు పోతున్నాడు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఆయన చాలా పెద్ద లీడ్‌లో కొనసాగుతున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఆ తదుపరి స్థానాల్లో త్రిగుణ్, ముఖేష్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తమ స్థానాలను కాపాడుకుంటూ సేఫ్ జోన్ వైపు వెళ్తున్నారు.

ప్రస్తుత ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. సృష్టి వ్యాకరణం, చరణ్ మహాదేవ్, బాటమ్ పొజిషన్స్ లో కొనసాగుతున్నారు. అయితే ఇవి కేవలం సోషల్ మీడియా అంచనాలు, అనధికారిక పోల్స్ మాత్రమే. అధికారిక ఓటింగ్ ఫలితాలు మరియు వారాంతపు ఎపిసోడ్‌లో నాగార్జున ఇచ్చే ట్విస్ట్‌ల బట్టే అసలైన ఎలిమినేషన్ ఎవరనేది తేలనుంది.

అంతే కాకుండా, ఈ వారం టోటల్ డామినేషన్ థీమ్ పెట్టారు కాబట్టి, ఎలిమినేషన్ లో కూడా ఈ థీమ్ ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.