Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ఈసారి నామినేషన్ బరిలో ఎనిమిది మంది!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. గ్రీన్ జోన్ సభ్యుల చేతిలో ఉన్న ప్రత్యేక అధికారాలతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 9:08 AM IST
Bigg Boss Telugu 10: ఈసారి నామినేషన్ బరిలో ఎనిమిది మంది!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. గ్రీన్ జోన్ సభ్యుల చేతిలో ఉన్న ప్రత్యేక అధికారాలతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి నామినేషన్లలో స్నేహితురాలైన వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేయడం ఇద్దరి మధ్య తీవ్ర మనస్తాపానికి దారి తీసింది.

వర్షిణి తనను అర్థం చేసుకోలేదని, తనకు సపోర్ట్ చేయలేదని భావించి త్రిగుణ్ తీవ్రంగా కుమిలిపోయాడు. శ్వేత, వంశీలతో మాట్లాడేటప్పుడు త్రిగుణ్ కంటతడి పెట్టుకుంటూ తనలో ఉన్న బాధని వెళ్లగక్కాడు. "నువ్వు నాక తెలిసిన త్రిగుణ్ కానే కాదు.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా?" అంటూ త్రిగుణ్ని వర్షిణి నిలదీసింది.

ఈ సిచువేషన్ ని కాస్త కూల్ చేయడానికి, ఆ తర్వాత నవ్వులు పూయించేందుకు నరేష్ మరియు రామ్‌ప్రసాద్ ముందుకొచ్చారు. గతంలో జరిగిన ఎండ్యూరెన్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడారని ఒక ఫన్నీ స్కిట్ చేశారు.

ఆ తర్వాత మరో లెవెల్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో గ్రీన్ జోన్ సభ్యులు జడ్జీలుగా వ్యవహరించారు. నరేష్ వచ్చి ఝాన్సీ మరియు వర్షిణిలను నామినేట్ చేశాడు. వర్షిణి తొందరగా గివ్ అప్ ఇస్తుందని, గేమ్‌ సరిగ్గా ఆడట్లేదని చెప్పగా.. తనకు సర్జరీ అయిందని వర్షిణి వివరణ ఇచ్చింది. ఇక ఝాన్సీ ఏడుస్తూ గేమ్ ఆడటానికి ఇష్టపడట్లేదని నరేష్ పాయింట్ పెట్టాడు.

శివ వచ్చి సుధీర్ మరియు వంశీలను నామినేట్ చేయగా.. జడ్జీలు సుధీర్ నామినేషన్‌ను ఫైనల్ చేశారు. ఆ తర్వాత రామ్‌ప్రసాద్ శివ మరియు శ్వేతలను నామినేట్ చేయగా, శివ నామినేషన్ ఖరారైంది. ఇక రెడ్ టీమ్‌లో ఉన్న సభ్యులకు కేవలం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. గ్రీన్ జడ్జీలు అందులో ఒకరిని ఫైనల్ చేయాల్సి వచ్చింది.

రోహిత్ - నరేష్‌ను, రామకృష్ణ - వర్షిణిని నామినేట్ చేయగా.. ఆర్కే పెట్టిన వర్షిణి నామినేషన్ అప్రూవ్ అయింది. ఝాన్సీ - శివను, శ్వేత - ఝాన్సీని నామినేట్ చేయగా.. శ్వేత పెట్టిన ఝాన్సీ నామినేషన్ ఫైనల్ అయింది.

ఫైనల్గా నామినేషన్లో ఉన్నది ఎవరంటే: ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, వంశీ