Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌజ్ లో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్?

ఈ ఏడాది 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ టీవీ షో నుంచి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   22 Sept 2026 1:31 PM IST
బిగ్ బాస్ హౌజ్ లో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్?
X

ఈ ఏడాది 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ టీవీ షో నుంచి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వరం లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి హడావుడి చేసి, చైత్ర రాయ్ ని, చరణ్ ని బయటకు పంపించేశారు. అయితే మళ్ళీ చరణ్ ని రెండో వారం లోనే వెనక్కి తీసుకు వచ్చి ఆ వారాంతం లో కృష్ణుడు ని పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కానీ ఊహించినంత డ్రామా మాత్రమ్ జరగట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఇంకో ఇద్దరు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ రూపం లో హౌజ్ లోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు.

వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నవారిలో అపూర్వ, మిథిలేష్, దీపక్ మరియు రామకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. షో మొదలైనప్పుడే అపూర్వ, రామకృష్ణ పేర్లు వినిపించాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్లకి అవకాశం రాకుండా పోయింది. అయితే ఈ ఇద్దరూ హౌజ్ లో ఉంటే కచ్చితంగా సరికొత్త డ్రామా మొదలవుతుంది అని ప్రేక్షకులు ఊహిస్తున్నారు.

గత ఏడాది మూడో వారంలో బుధవారం నాడు ముగ్గురు 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్లను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. అదే తరహాలో రేపు కూడా ఈ ప్రక్రియ రిపీట్ కానుందని, కాకపోతే ఈసారి నలుగురు కంటెస్టెంట్లను పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు వెళ్లబోయే కంటెస్టెంట్స్ కి ఏవైనా చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వడం, లేదా వోటింగ్ పెట్టడం వంటివి చేయచ్చు. పైగా ఈ వారం థీమ్: టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ కనుక, దానికి అనుగుణంగా ఈ ఇద్దరినీ ఇంట్లోకి దింపే అవకాశాలు లేకపోలేదు.

అగ్ని పరీక్ష షో ప్రకారం అపూర్వకు, రోహిత్‌కు ఏమాత్రం పడదు. దీన్ని క్యాష్ చేసుకుని, రోహిత్, షాలిని మరియు సృష్టిల మధ్య డ్రామా రూపొందించొచ్చు. ఝాన్సీ కి సింపతీ వర్క్ అవుతుంది అనిపించినా ఆమె ఆట తీరు ఎక్కువ నెగటివిటీ జనరేట్ చేస్తున్న సందర్భం లో రామకృష్ణ ని తీసుకు రావచ్చు.