కెప్టెన్ అపూర్వకి గౌరవం ఇవ్వరా?
అన్నిటికన్నా ముఖ్యంగా కెప్టెన్ అపూర్వకు, ముఖేష్‌కు మధ్య గిన్నెలు తోమడం మరియు కెప్టెన్ రూమ్ ఖాళీ చేసే విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
By: Priya Chowdhary Nuthalapti | 29 Sept 2026 9:10 AM ISTబిగ్‌బాస్ హౌస్‌లో నాల్గవ వారం పూర్తిగా టోటల్ డామినేషన్ థీమ్‌తో రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజే హౌస్‌మేట్స్‌ను టీమ్ భైరవ, టీమ్ సప్త శక్తిగా విభజించి బిగ్‌బాస్ పెద్ద గొడవకే తెరలేపారు. ఈ ఆటలో జరిగిన అరుపులతో, ఫైట్స్తో బిగ్‌బాస్ ఇల్లు దద్దరిల్లిపోయింది.
అన్నిటికన్నా ముఖ్యంగా కెప్టెన్ అపూర్వకు, ముఖేష్‌కు మధ్య గిన్నెలు తోమడం మరియు కెప్టెన్ రూమ్ ఖాళీ చేసే విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక మీటింగ్ పెట్టి రూల్స్ చెప్పిన తర్వాతే పాటిస్తానని ముఖేష్ అనడంతో, అపూర్వ వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసింది. కెప్టెన్‌కు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదంటూ అపూర్వ నిలదీసింది.
మరోవైపు అపూర్వ తనను ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ చేయాలని చూస్తోందని షాలిని రోహిత్ దగ్గర వాపోయింది. ఇక ఈ వారం టాస్క్ లో భాగంగా షాలిని, సృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీలను 'సప్త శక్తి' టీమ్‌గా విడగొట్టగా, మిగిలిన వారిని 'భైరవ' టీమ్‌గా విభజించారు. మొదటి పోరులో ఆధిపత్యం చెలాయిస్తే అద్భుతమైన పర్క్ లభిస్తుందని తెలిపారు.
అయితే ఈ గేమ్ లోనే రూల్స్ గురించి రోహిత్, షాలిని మాట్లాడుకుంటుండగా అపూర్వ అక్కడకు వెళ్లి మాట్లాడబోయింది. ప్రతిసారీ మధ్యలో దూరిపోతావా అంటూ షాలిని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చూస్తుంటే రోహిత్ కి అపూర్వ దగ్గరవుతుందేమో అని షాలిని తెగ కంగారు పడుతున్నట్లు అనిపిస్తుంది.
అలాగే టాస్క్ జరుగుతున్న క్రమంలో త్రిగుణ్, రోహిత్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, ఇద్దరూ దూకుడుగా ప్రవర్తించారు. ఇద్దరూ ఒకరి మీదకి ఒకరు వెల్తూ, విపరీతంగా తిట్టుకుంటూ, ఇద్దరూ ఆల్మోస్ట్ కొట్టుకొనే వరకు వెళ్లారు. చాలా సేపటి వరకు ఇద్దరూ తిట్టుకొని ఆల్మోస్ట్ పర్సనల్ ఎటాక్స్ కి కూడా దిగారు. అయితే టాస్క్ ముగిసే సమయానికి భైరవ టీమ్ విజయం సాధించి ఆధిపత్యం చూపించింది.
ఇక ఈ రోజు జరగాల్సిన నామినేషన్స్ ప్రక్రియ రేపు జరగనున్న నేపథ్యంలో తాజాగా జరిగిన గొడవలు ప్రభావితం చూపించే అవకాశం లేకపోలేదు.
