బిగ్ బాస్ 9.. నామినేషన్స్ లో ఎవరెవరు రిస్క్ ఎవరికి..?
బిగ్ బాస్ సీజన్ 9లో నాల్గవ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది.
By: Ramesh Boddu | 1 Oct 2025 11:20 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో నాల్గవ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్ కన్నా ముందు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ అందులో గెలిచిన సుమన్ శెట్టి, తనూజలను ఈ నామినేషన్స్ నుంచి సేఫ్ చేశాడు. ఇక కెప్టెన్ గా పవన్ ని ఎలాగు నామినేట్ చేసే ఛాన్స్ లేదు.
బిగ్ బాస్ హౌస్ మెట్స్ నామినేషన్స్..
నామినేషన్స్ కోసం బిగ్ బాస్ మిగిలిన హౌస్ మెట్స్ ని ముగ్గురు చొప్పున టీంస్ గా విడగొట్టాడు. వారికి పవన్ డైస్ వేసి నెంబర్ చెబుతాడు. ఆ నెంబర్ తో వాళ్ల కోన్ ముందుకు తీసుకెళ్లి అక్కడ నామినేట్ అని వస్తే ఒకరిని నామినేట్ చేయాలి. లేదా నామినేషన్ టాస్క్ అని వస్తే బిగ్ బాస్ ఇచ్చిన ఎలాస్టిక్ తాడుతో ముగ్గురు కలిసి ఒక బాక్స్ ని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పాయింట్ లో పెట్టాలి.
అలా నామినేషన్ ప్రక్రియ మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఫైనల్ గా ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి దివ్య, శ్రీజ, హరీష్, రీతు, సంజన, ఫ్లోరా షైనీలు నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే నామినేషన్స్ లో సంజనని నామినేట్ చేసేందుకు రాము రాథోడ్ మాట్లాడుతుంటే సంజన అతన్ని ఎక్కడ నుంచి వచ్చావ్ అన్నది. దానికి ఎక్కడ నుంచి వచ్చావ్ అన్న పదం పై రాము గొడవ పడ్డాడు. సుమన్ శెట్టి కూడా అలా అనకూడదని అన్నాడు.
సంజనకి క్లోజ్ గా ఉన్న ఇమ్మాన్యుయెల్..
సంజనకి క్లోజ్ గా ఉన్న ఇమ్మాన్యుయెల్ కూడా అలా అనకూడదు అది తెలుగే కానీ వేరే మీనింగ్ వస్తుందని అన్నాడు. భరణి కూడా అదే విషయాన్ని సంజనకి చెప్పాడు. ఐతే తాను తప్పుగా అనలేదని సంజన వారించింది. ఇక నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ముగ్గురు కామనర్స్, ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు. ఐతే ఈ వారం ఎలిమినేషన్ రిస్క్ అంటూ అది హరీష్, శ్రీజకే అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ ప్రియ వెళ్లాక శ్రీజ లో ఎందుకో కాస్త కాన్ ఫిడెన్స్ తగ్గి భయం మొదలైంది అన్నట్టు ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్నిపరీక్ష దాటుకుని మరీ కామనర్స్ హౌస్ లోకి వచ్చారు. వారిలో ప్రస్తుతం హౌస్ లో హరీష్, కళ్యాణ్, పవన్, శ్రీజ మాత్రమే ఉన్నారు. వీరిలో ఈ వీకెండ్ మరో కామనర్ ఎలిమినేట్ అయితే మాత్రం మిగిలిన వాళ్లకి టఫ్ అని చెప్పొచ్చు. ఐతే లాస్ట్ మిడ్ వీక్ లో దివ్య కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సడెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. అంతేకాదు హౌస్ లో దివ్యా పెడుతున్న పాయింట్స్ అన్నీ బాగున్నాయి.
