బిగ్ బాస్ 9.. థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఎవరంటే..?
ఐతే రీతు చౌదరి డీమాన్ పవన్ ఆమెను సేఫ్ చేస్తాడని అనుకుంది కానీ అది జరగలేదు.
By: Ramesh Boddu | 23 Sept 2025 9:38 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో థర్డ్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. లాస్ట్ వీకెండ్ నాగార్జున ఓనర్స్ ని టెనంట్స్ గా.. టెనంట్స్ ని ఓనర్స్ గా చేశాడు. ఇక ఈసారి ఓనర్స్, టెనంట్స్ రెండు గ్రూప్ లకు కూడా అందరు కలిసి వాళ్లలో ఒకరిని.. టెనంట్స్ అయితే ఓనర్స్ లో ముగ్గురిని నామినేట్ చేయాలి. అలా ఓనర్స్, టెనంట్స్ డెసిషన్స్ మార్చుకుని మరీ ఫైనల్ గా ఆరుగురు హౌస్ మెట్స్ ఫైనల్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి ఓనర్స్ నామినేట్ చేసేటప్పుడు టెనంట్స్, టెనంట్స్ నామినేట్ చేసేటప్పుడు ఓనర్స్ టీవీల్లో ఈ ప్రాసెస్ ని చూశారు.
ఫైనల్ గా థర్డ్ వీక్ నామినేషన్స్..
బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఫైనల్ గా ఓనర్స్ నుంచి తీరు చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్ నామినేషన్స్ లో ఉండగా హరీష్, కళ్యాణ్, ప్రియా శెట్టి ఈ ముగ్గురు నామినేషన్స్ లోకి వచ్చారు. సో థర్డ్ వీక్ లో రీతు చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్ వీళ్లు సెలబ్రిటీ కటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా.. హరీష్, కళ్యాణ్, ప్రియా శెట్టి కామనర్స్ నుంచి నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
డీమాన్ పవన్ కెప్టెన్ అవ్వడం వల్ల నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయాలని అనగా.. అతను శ్రీజని సేఫ్ చేశాడు. ఐతే రీతు చౌదరి డీమాన్ పవన్ ఆమెను సేఫ్ చేస్తాడని అనుకుంది కానీ అది జరగలేదు. ఫైనల్ గా నామినేషన్స్ లో రీరు, రాము రాథోడ్, ఫ్లోరా, ప్రియా, హరీష్, కళ్యాణ్ ఉన్నారు. హౌస్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. ఈ వారం ఆటలో వారి ఆటని బట్టే కాకుండా ఈ 3 వారాలు వాళ్ల బిహేవియర్, ఆటని బట్టి కూడా వాళ్లను ఆడియన్స్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్..
బిగ్ బాస్ సీజన్ 9 గడిచిన రెండు వారాలు ఇంట్రెస్టింగ్ గానే సాగింది. తప్పకుండా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా టీం అంతా కృషి చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో రెండు వారాలు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం శ్రేష్ట వర్మ ఎలిమినేట్ కాగా.. లాస్ట్ వీక్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ 9 లో ఎవరు ఎలా ఇంటి నుంచి బయటకు వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
